News' భ‌గ‌వంత్ కేస‌రి ' ర‌న్ టైం లాక్‌... బాల‌య్య విశ్వ‌రూపం...

‘ భ‌గ‌వంత్ కేస‌రి ‘ ర‌న్ టైం లాక్‌… బాల‌య్య విశ్వ‌రూపం ఎన్ని నిమిషాలంటే…!

నందమూరి నట‌సింహ బాలకృష్ణ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా.. యంగ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల ముఖ్యపాత్రలో తెర‌కెక్కుతున్న సినిమా భగవంత్‌ కేసరి అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సాలిడ్ మాస్ యాక్షన్ డ్రామా దసరా కానుకగా వచ్చే నెల 19న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ తో ఈ సినిమాకు అదిరిపోయే హైప్‌ క్రియేట్ అయింది.

ఈ సినిమా టీజర్ చూస్తున్నప్పుడు బాలయ్య నేలకొండ భగవంత్‌ కేసరి అనే చెప్పే డైలాగ్ అదిరిపోయింది అని చెప్పాలి. ఒక్క డైలాగ్‌తోనే బాల‌య్య పూన‌కాలు తెప్పించేశాడు. కేవలం నందమూరి బాలయ్య అభిమానులు మాత్రమే కాదు… తెలుగు సినీ జనాలు అందరూ ఈ సినిమా కోసం ఎంతో ఎక్సయిటెడ్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా గురించి మరో ఇంటరెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చేసింది. ఈ సినిమా రన్ టైం లాక్ అయింది. భగవంత్‌ కేసరి రన్ టైం 2:37 గంట‌లు ఉంటుందట.

అంటే మొత్తం 157 నిమిషాల క్రిస్పీ రన్ టైం తో సినిమా నడుస్తుంది. 157 నిమిషాల పాటు బాల‌య్య థియేట‌ర్లలో విశ్వ‌రూపం చూపించేయ‌నున్నాడు. బాలయ్య అఖండ – వీర సింహారెడ్డి సినిమాల రన్ టైంతో పోలిస్తే ఇది కాస్త తక్కువే అని చెప్పాలి. ఏది ఏమైనా దర్శకుడు అనిల్, రావిపూడి ఎడిటర్ చాలా క్రిస్పీగా సినిమాను తీసి ఎడిట్ చేసినట్టు క్లారిటీగా తెలుస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్ సినిమాస్ నిర్మిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news