నటరత్న ఎన్టీఆర్ నట వారసుడుగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన నందమూరి బాలకృష్ణ తన నటనతో నటసింహం బాలయ్యగా గుర్తింపు తెచ్చుకున్నాడు. మాస్ సినిమాలకు పెట్టింది పేరుగా బాలయ్య రికార్డులను అందుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లోనే సీనియర్ హీరోలలో బాలయ్య ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్న బాలయ్య ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమా చేస్తున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అవ్వగా దసరా కానుకగా అక్టోబర్ 19న బాలయ్య ప్రేక్షకులు ముందుకు రానున్నాడు. రీసెంట్ గానే సినిమా నుంచి వచ్చిన మొదటి పాట కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇదే సమయంలో బాలయ్య ఒక్కోసారి ఫైర్ అవుతూ ఉంటాడు.. కొన్నిసార్లు అభిమానులపై చేయి చేసుకున్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అంతేకాకుండా కోపం వస్తే ఫోన్లు విసరడాలు.. ఎవరికి పడితే వారికి వార్నింగులు ఇవ్వడాలు ఎలా బాలయ్య చేసే కొన్ని పనులతో ఆయనకు కోపం ఎక్కువ అనే పేరుని తెచ్చిపెట్టాయి.
ఆయన అభిమానులు ఆయనతో నటించిన వాళ్లు మాత్రం బాలయ్యది చిన్నపిల్లల మనస్తత్వం అని చెబుతూ ఉంటారు. అయితే కోపదాటి మనిషిగా పేరు తెచ్చుకున్న బాలయ్య ఇప్పుడు కోపాన్ని తగ్గించుకోవాలంటే ఏం చేయాలో కొన్ని టిప్స్ చెప్పడం అందరిని ఆశ్చర్యం కలిగించింది. బాలయ్య తాను కోపం తగ్గించుకోవడానికి కొన్ని టిప్స్ ను పాటిస్తానని చెప్పాడు.. కోపాన్ని కంట్రోల్ చేసుకునేందుకు మొత్తం ఐదు టిప్స్ ని పాటిస్తానని చెప్పుకొచ్చాడు.
అందులో మొదటిది మాట్లాడే ముందు కాస్త ఆలోచించి మాట్లాడాలని, రెండోది కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే కోపం వచ్చిన వెంటనే అంకెలు లెక్క పెట్టాలని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా కోపం వచ్చినప్పుడు అరవకుండా నెమ్మదిగా మాట్లాడే ప్రయత్నం చేయాలని కూడా బాలయ్య చెప్పుకొచ్చాడు. మనసులో ఏమీ పెట్టుకోకుండా ఏది ఉంటే అది చెప్పాలని ఇతరులపై కోపం ఉన్న వారిని క్షమించాలని తెలిపాడు.
చివరగా బాలయ్య ఇచ్చిన ఈ టిప్ ఎంతో ముఖ్యమైనది.. తన కోపమే తనకు శత్రువు కాబట్టి కోపాన్ని వీలైనంతగా తగ్గించుకునేందుకు ప్రయత్నించి సంతోషంగా ఉండాలని చెప్పుకొచ్చారు. ఎవరైనా కోపిష్టి అయి ఉంటే పైన బాలయ్య చెప్పిన టిప్స్ పాటిస్తే వారికి కోపాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అంటూ గతంలో బాలయ్న మాట్లాడిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు బాలయ్య అభిమానులు.