Movies' సింహా ' సినిమా ఛాన్స్ ఇచ్చేముందు బోయ‌పాటికి బాల‌య్య పెట్టిన...

‘ సింహా ‘ సినిమా ఛాన్స్ ఇచ్చేముందు బోయ‌పాటికి బాల‌య్య పెట్టిన కండీష‌న్లు ఇవే..!

నటసింహం నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే మాస్‌ ప్రేక్షకులకు పూనకాలు వచ్చేస్తాయి. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ ఒకదానిని మించి ఒకటి సూపర్ హిట్ అయ్యాయి. ఇక వీరిద్దరి కాంబినేషన్లో నాలుగో సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. అయితే అది అఖండ సినిమాకు సీక్వెల్ గా ఉంటుందా కొత్త కథతో ఉంటుందా ? అన్నదే చూడాలి.

వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన తొలి సూపర్ హిట్ సినిమా సింహ. బోయపాటికి ఈ సినిమా ఛాన్స్ ఇవ్వటానికి ముందు బాలయ్య ఒక కండిషన్ పెట్టారట. అప్పటికే బాలయ్య వరుస ప్లాపులతో ఇబ్బంది పడుతున్నారు. ఎలాగైనా ఈసారి సినిమాతో సూపర్ హిట్ కొట్టాలని ఆయన కసితో ఉన్నారు. బోయపాటి కథ చెప్పిన వెంటనే బాగుంది అన్న బాలయ్య.. అనుభవం లేని బోయపాటి అంత మాస్ ఎలిమెంట్స్ ఎలా హ్యాండిల్ చేస్తాడో ? అని సందేహం వ్యక్తం చేశారట.

మొదటి షెడ్యూల్లో ఒక ఫైట్ సీన్ తీద్దాం అది బాగా చేస్తే సినిమా కంటిన్యూ చేద్దాం లేకపోతే ఆపేద్దాం అని చెప్పాడట. దానికి తగ్గట్టుగానే బోయపాటి మొదటి షెడ్యూల్లో ట్రైన్ ఎపిసోడ్ ఫైట్స్ తీశాడట. అది చూసిన బాలయ్యకు ఆయన మేకింగ్.. టేకింగ్ మీద నమ్మకం పెరిగి సినిమా కంటిన్యూ చేశాడట. అలా ప్రారంభమైన వారిద్దరి కాంబినేషన్ వరుస సూపర్ డూపర్ హిట్లతో దూసుకుపోతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news