సినిమా ఇండస్ట్రీలో హీరో తరుణ్ కు ఎంతటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అంతేకాదు టాలీవుడ్ లవర్ బాయ్ గా పాపులారిటీ సంపాదించుకున్న తరుణ్ ఆ తర్వాత కూడా పలు సినిమాలో నటించి మంచి క్రేజ్ దక్కించుకున్నాడు. అయితే పెరిగిపోతున్న కాంపిటీషన్ తట్టుకోలేక తరుణ్ వెనకబడిపోయారు. కానీ ఆయనలో మంచి నటన స్కిల్స్ ఉన్నాయి . కాగా ఇండస్ట్రీలో ఆయన ఆర్తి అగర్వాల్ ను మోసం చేశాడు అన్న న్యూస్ ఎప్పటినుంచో మనం వింటూనే ఉన్నాం. అంతే కాదు ప్రియమణి తో కూడా ఆయన ప్రేమాయణం నడిపాడు అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి .
అయితే ఆర్తి అగర్వాల్ తర్వాత ప్రియమణి కన్నా ముందు మధ్యలో మరో హీరోయిన్ తో కూడా ఆయన ప్రేమాయణం నడిపాడు అంటూ వార్తలు అప్పట్లో బాగా వినిపించాయి. ఆమె మరి ఎవరో కాదు శ్రీదేవి . నిన్నే ఇష్టపడ్డాను సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించిన శ్రీదేవితో ఆయన బాగా క్లోజ్ గా మూవ్ అయ్యాడు . అంతే కాదు వాళ్ళ జంట కూడా చూడ చక్కగా ఉండడంతో ..కెమిస్ట్రీ బాగా పడడంతో వీళ్ళు ప్రేమించుకుంటున్నారు అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి .
తరుణ్ కూడా ఆ వార్తలను ఖండించకపోవడంతో వీరు నిజంగా ప్రేమించుకుంటున్నారు అంటూ ఫిక్స్ అయిపోయారు జనాలు . రేపో మాపో పెళ్లి చేసుకుంటారు అనుకునే లోపే ఈ జంట బ్రేకప్ అంటూ వార్తలు వైరల్ అయ్యాయి . దీంతో తరుణ్ ఖాతాలో మరో హీరోయిన్ బలైపోయినట్లు అయింది . ఆ తర్వాత ప్రియమణితో కూడా ప్రేమాయణం నడిపాడు అంటూ వార్తలు వినిపించాయి . ప్రజెంట్ తరుణ్ పెళ్లి చేసుకోకుండా సింగిల్గానే లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు..!!