సోషల్ మీడియాలో ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది కచ్చితంగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటి సంపాదించుకున్న హీరోయిన్ అనుష్క పెళ్లి మేటర్ అనే చెప్పాలి . సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి కొన్ని దశాబ్దాలు దాటుతున్న సరే ఈ అందాల ముద్దుగుమ్మ ఇంకా పెళ్లిపై ఆ గుడ్ న్యూస్ చెప్పనేలేదు . ఇదిగో పెళ్లి అదిగో పెళ్లి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం తప్పిస్తే తన పెళ్లిపై అనుష్క శెట్టి ఎటువంటి ప్రకటన చేయలేదు.
కాగా ఫస్ట్ టైం అనుష్క శెట్టి “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన పెళ్లి పై స్పందించింది. ప్రముఖ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ సినిమాకి సంబంధించిన విషయాలతో పాటు తన పరసనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకుంది . ఈ క్రమంలోనే సినిమాలో తన పాత్ర చాలా బాగుంటుంది అని ..చాలామంది అమ్మాయిలకు కనెక్ట్ అవుతుందని చెప్పుకొచ్చింది.
అంతేకాదు నవీన్ పోలిశెట్టితో నటించడం చాలా చాలా ఫన్నీగా ఉందని.. తెరపై మా కాంబో ని బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పుకొచ్చింది. లాస్ట్ లో హోస్ట్ మరి మీ పెళ్లిపై ఏదైనా గుడ్ న్యూస్ అనగానే.. “చేసుకుంటాను ..పెళ్లి కచ్చితంగా చేసుకుంటాను.. కానీ టైం రావాలి.. అందరూ నేను పెళ్ళికి వ్యతిరేకం అనుకుంటున్నారు.. కానీ కాదు నేను పెళ్లి చేసుకుంటాను ..ఆ సమయం వచ్చినప్పుడు ఆ గుడ్ న్యూస్ మీకు చెప్తాను ..త్వరలోనే ఆ గుడ్ న్యూస్ వినిపిస్తాను “అంటూ క్లారిటీ ఇచ్చింది. దీనితో సోషల్ మీడియాలో అనుష్క పెళ్లి వార్త మరోసారి వైరల్ గా మారింది.