సినిమా ఇండస్ట్రీలో బోలెడు మంది అందాల ముద్దుగుమ్మలు ఉన్న .. హీరోయిన్స్ గా రాజ్యమేలుస్తున్న విచ్చలవిడిగా అందాలు ఆరబోస్తున్న సరే .. జేజమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న అనుష్క శెట్టికి ఉన్న క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ మరి ఏ హీరోయిన్ కి లేదనే చెప్పాలి. చిట్టి పొట్టి బట్టలు వేసి అలరిస్తూ ఉన్నా సరే నిండుగా చీర కట్టుకొని పద్ధతిగా చుడీదార్స్ లో అమ్మడు ఇప్పటికి హీరోయిన్ అవకాశాలు అందుకుంటుంది .. అంటే దానికి కారణం ఆమెకున్న ఫాలోయింగ్ అనే చెప్పాలి .
రీసెంట్గా ఆమె నటించిన సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి.. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అంతేకాదు అనుష్క శెట్టికి మంచి కం బ్యాక్ ఇచ్చింది. ఈ క్రమంలోనే వరుస సినిమాలకు కమిట్ అవుతున్న అనుష్క త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కూడా నటించబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. ఇలాంటి క్రమంలోనే ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి . సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అనుష్క ను ఓ ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూ చేసింది .
ఈ మధ్య కాలంలో ఎక్కువుగా గుడి లకు వెళ్తున్నారు..? అని యాంకర్ అడగ్గా.. అనుష్క మంచిగా కూల్ గా ఆన్సర్ ఇచ్చింది . “చిన్నతనం నుంచి నా ఫ్యామిలీకి ఎక్కువగా దైవభక్తి ఉంది ..అదే నాకు వచ్చింది ..ఇప్పటికి సోమవారం . శుక్రవారం ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తూ ఉంటాను . ఖాళీగా ఉంటే కచ్చితంగా దేవుడు గుడికి వెళ్లి దేవుడి దర్శనం చేసుకుంటాను “అంటూ చెప్పుకొచ్చింది. ఈ పూజలు పెళ్లి కోసమేనా..? అని యాంకర్ అడగ్గా.. నవ్వుతూ అలాంటిదేమీ లేదు.. కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను,.. కానీ ఇప్పుడే చేసుకోను ..ప్రజెంట్ సినిమాలపై ఫోకస్ చేయాలనుకుంటున్నాను అంటూ అనుష్క చెప్పుకొచ్చింది. దీంతో అనుష్క చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే అనుష్క జాతకంలో దోషం ఉందని..ఆ కారనంగానే ఆమెకు పెళ్లి కావడం లేదని ప్రచారం జరిగింది..అందుకే అనుష్క ఇలా గుడిలు తిరుగుతుందేమో అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి..!