Moviesఆ కార‌ణంతోనే నా కంటే చిన్నోడి ప‌క్క‌న హీరోయిన్‌గా చేశా… అనుష్క...

ఆ కార‌ణంతోనే నా కంటే చిన్నోడి ప‌క్క‌న హీరోయిన్‌గా చేశా… అనుష్క సెన్షేష‌న‌ల్ కామెంట్స్‌..!

టాలీవుడ్ స్వీటీ అనుష్క ఐదేళ్ల తర్వాత రేపు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరిస్తోంది. ఈ సినిమా ఆమె చేయటానికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రభాస్‌కు హోమ్ థియేటర్ లాంటి యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మించింది. యూవి ప్రమోద్ – వంశీ కూడా అనుష్కకు చాలా సన్నిహితులు. ప్రభాస్ ద్వారా వీరిద్దరితో అనుష్కకు ఎప్పటినుంచో పరిచయం.. స్నేహం ఉన్నాయి

ఈ సినిమా డైరెక్టర్ మహేష్ ఒకసారి అనుష్కను కలిసినప్పుడు ఈ సినిమా కథ చెప్పాడట. అయితే ఈ క‌థ‌ను ఎవరితో చేస్తున్నారు అని మహేష్ ను ప్రశ్నించిందట అనుష్క. అయితే అనుష్క మనసులో మాత్రం ఈ కథలో నేను చేస్తే బాగుండును అన్న కోరిక ఉందట. అప్పటికి డైరెక్టర్ మహేష్ హీరోయిన్ గా ఎవరిని ఫిక్స్ చేయలేదు. దీంతో వెంటనే అనుష్కకు కథ నచ్చ‌డంతో ఆమె ఓకే చెప్పేసింది.

అయితే వయసులో తనకన్నా చిన్నోడు అయినా నవీన్ పోలిశెట్టితో సినిమా చేయటంపై ఎలా ? ఫీల్ అవుతున్నారు అన్న ప్రశ్నకు అనుష్క షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. ఈ సినిమా కథ బాగా కుదిరింది అని.. తనతో పాటు నవీన్ పాత్ర రెండు ఒకటే స్వభావం కలిగి వేరు వేరు ప్రదేశాల్లో పెరిగిన పాత్రలు అని సినిమా చాలా అద్భుతంగా వచ్చింది అని అనుష్క తెలిపింది. ఏది ఏమైనా ఈ సినిమాతో అనుష్క గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇవ్వాలన్న కోరిక‌తో ఉంది. మరి ఆమె కోరిక తీరుతుందో లేదో మరి కొద్ది గంటల్లో తేలిపోతుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news