Moviesమ‌హేష్ ఫ్యామిలీలోకి మ‌రొక‌రు… న‌మ్ర‌త క‌న్‌ఫార్మ్ చేసిందిగా…!

మ‌హేష్ ఫ్యామిలీలోకి మ‌రొక‌రు… న‌మ్ర‌త క‌న్‌ఫార్మ్ చేసిందిగా…!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు – ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది వచ్చిన సర్కారు వారి పాట సినిమా తర్వాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకుని మహేష్ ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవల మహేష్ బాబు ఇంట విషాదం జరిగింది. మహేష్ బాబు ఫ్యామిలీలో ఎంతో ప్రేమగా పెంచుకునే ఫ్లూటో పెట్‌ మృతి చెందింది.

దీంతో నమ్రిత – సితార సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి ఎమోషనల్ అయ్యారు. అయితే వాళ్ళు ఇద్దరే కాదట. ఫ్లూటో మరణంతో మహేష్ బాబు కూడా ఎమోషనల్ అయ్యి రెండు రోజులపాటు షూటింగ్కు రాకుండా బ్రేక్ ఇచ్చాడట. అంతలా వారు ఆ పెట్‌కు కనెక్ట్ అయిపోయారు. ఇక ఫ్లూటో నిత్యం గుర్తుకు రావడంతో అచ్చు అలాగే ఉండే మరో పెట్‌ను తెచ్చుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని మహేష్ భార్య నమ్మత నేరుగా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది.

ఈ మేరకు ఫ్లూటో ఎలాగైతే వచ్చిందో అలాగే స్నూపీ కూడా మా ఇంటికి వచ్చింది.. ఫ్లూటోనే అతడిని మా వద్దకు పంపినట్లు మేము ఊహిస్తున్నాము… కోల్పోయిన ప్లూటో ప్లేస్ లో ప్రేమించడానికి మా కుటుంబంలో స్నూపీకి స్వాగతం.. నిన్ను మరింత ప్రేమిస్తామ‌ని ఆశిస్తున్నాను అంటూ నమ్రత కామెంట్ చేసింది. ఇప్పుడు ఈ కామెంట్ సోషల్ మీడియాలో పిచ్చిపిచ్చిగా వైరల్ అవుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news