Moviesబాల‌య్య - బోయ‌పాటి కొత్త సినిమా అప్‌డేట్‌ వచ్చేస్తుందోచ్..నా సామీ రంగ...

బాల‌య్య – బోయ‌పాటి కొత్త సినిమా అప్‌డేట్‌ వచ్చేస్తుందోచ్..నా సామీ రంగ ఇక దబిడి దిబిడే..!!

నందమూరి బాలకృష్ణ.. యాక్షన్ సినిమాల‌ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన మూడు సినిమాలు సూపర్ డూపర్ హిట్. సింహ – లెజెండ్ – అఖండ సినిమాల పేర్లు చెప్తేనే నందమూరి అభిమానుల్లో మాత్రమే కాదు. తెలుగు సినీ జనాలకు పూనకాలు వచ్చేస్తాయి. ఇక వీరిద్దరి కాంబినేషన్లో అఖండ సినిమాకు సీక్వెల్ గా అఖండ 2 రాబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.

అఖండ సినిమా సీక్వెల్ స్క్రిప్ట్ కూడా ఇప్పటికే పూర్తయిందని బాలయ్య క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలోని ఈ సినిమా కథ గురించి తాజాగా ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. బాలయ్య‌తో బోయపాటి చేస్తున్న కథలో సోషల్ ఫాంటసీ అండ్ ఫ్యూచరిస్టిక్‌ ఎలిమెంట్స్ ఉంటాయని… మెయిన్ కథాంశ‌మే చాలా కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. బాలయ్య నుంచి మరో వైవిధ్యమైన సినిమా రాబోతుందని.. ఇక బోయపాటి మార్క్‌ యాక్షన్ సీన్లు మాత్రం సినిమాలో ఫుల్ గా ఉంటాయని తెలుస్తోంది.

ప్రస్తుతం బాలయ్య అనిల్ రావిపూడితో భగవంత్‌ కేసరి సినిమా చేస్తున్నారు. ఈ సినిమా దసరా కనుకగా అక్టోబర్ 19న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా తర్వాత బాలయ్య.. దర్శకుడు బాబి కలయికలో తెరకెక్కే సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత బాలయ్య బోయపాటి అఖండ 2 సినిమా ప్రారంభమవుతుందని తెలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news