Newsఅల్లు అర‌వింద్ నా జీవితంలో పెద్ద శ‌త్రువు... రానా ద‌గ్గుబాటి ప‌ట్ట‌రాని...

అల్లు అర‌వింద్ నా జీవితంలో పెద్ద శ‌త్రువు… రానా ద‌గ్గుబాటి ప‌ట్ట‌రాని కోపం వెన‌క‌…!

దగ్గుబాటి రానా లీడర్ సినిమాతో టాలీవుడ్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత కొన్ని సినిమాలలో నటించిన రానాకు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా రేంజ్ లో ఇమేజ్ వచ్చింది. బాహుబలి సినిమాలో ప్రభాస్ ని ఢీకొట్టే విలన్ భ‌ల్లాలదేవుడిగా రానా నట విశ్వరూపం చూపించాడు. అంతేకాకుండా రానా నిర్మాతగా, హీరోగా, విల‌న్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు.

ఇటీవల రానా నాయుడు వెబ్ సిరీస్ లో బోల్డ్ గా నటించి రెచ్చిపోయాడు. అలాగే తన ప్రియురాలు మిహికా బజాజ్ ను పెళ్లాడి వైవాహిక జీవితాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. రానా తన తాజా ఇంటర్వ్యూలో టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రానా – రాంచరణ్ చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి ఉన్నప్పుడు ఏదైనా మిస్టేక్ చేస్తే రామ్ చరణ్ చిరంజీవి దగ్గర అడ్డంగా దొరికిపోయేవాడట.

అదే సమయంలో చిరంజీవి అల్లు అరవింద్ కి చెబితే ఆయన వెంటనే ఫోన్ చేసి రానా తండ్రి సురేష్ బాబుకి చెప్పేసేవారట. దీంతో రానా ఇంటికి వచ్చే రావడంతోనే తండ్రితో దెబ్బలు తినేవారట. ఈ కారణంతోనే అల్లు అరవింద్ నా జీవితంలో పెద్ద శత్రువు అయిపోయాడు.. అంటూ రానా సరదాగా ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రస్తుతం రానా చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news