టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహరెడ్డి టాలీవుడ్ స్టార్ హీరోల భార్యలలో ఎవరికి లేని విధంగా సోషల్ మీడియాలో ఫాలోయింగ్ సంపాదించారు. సోషల్ మీడియాలో ఆమెకు మిలియన్లలో ఫాలోవర్లు ఉన్నారు. ఏ టాలీవుడ్ స్టార్ హీరో భార్యకు కూడా స్నేహరెడ్డికి ఉన్న రేంజ్ లో ఫాలోవర్లు లేరు. స్నేహారెడ్డిది బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. స్నేహారెడ్డి స్వస్థలం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ నియోజకవర్గం.
వీరి కుటుంబానికి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంతో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల పలు ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. అలాగే హైదరాబాద్‌లో చాలా వ్యాపారాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే చాలా చిన్న వయసులోనే అల్లు అర్జున్‌తో ప్రేమలో పడింది స్నేహా. ఒకానొక కాలేజీ ఫంక్షన్ లో అల్లు అర్జున్ ఆటోగ్రాఫ్ తీసుకున్న స్నేహారెడ్డి కొంతకాలానికి అతడితో ప్రేమలో పడిపోయింది. ముందుగా బన్నీయే స్నేహరెడ్డిని ఇష్టపడ్డాడు.
అప్పటికి ఆమెది చాలా చిన్న వయసు. 2011లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే ప్రస్తుతం ( సెప్టెంబర్ 29న) స్నేహ రెడ్డి 29వ పుట్టినరోజు చేసుకున్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తన ప్రియమైన భార్యకు ఇన్స్టాగ్రామ్ లో ఓ స్పెషల్ వీడియో షేర్ చేసి మరియు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. హ్యాపీ బర్తడే క్యూటీ.. సన్ షైన్ ఆఫ్ మై లైఫ్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ఈ దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె కూడా ఉన్నారు.
ఇక్కడే ఓ మెలిక కూడా ఉంది. ఇప్పుడు స్నేహారెడ్డి వయస్సు 29. అంటే పెళ్లి జరిగి 12 ఏళ్లు అవుతోంది. అప్పటికి ఆమె వయస్సు 17. అంటే స్నేహారెడ్డి మైనర్‌గా ఉన్నప్పుడే ఆమె డేట్ దాచేసి మైనర్‌ను బన్నీ పెళ్లి చేసుకున్నాడన్న మాట. ఇదే మ్యాటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. మామూలుగా ఆడపిల్లలకు 18 ఏళ్లు వస్తే గాని పెళ్లి చేయకూడదన్న రూల్ తెలిసిందే.
అల్లు అర్జున్ – స్నేహ రెడ్డి ఎంత బిజీగా ఉన్నా కూడా పిల్లలతో వెకేషన్ లకు వెళుతూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ ఇప్పటికే వెండితెరపై కూడా ఎంట్రీ ఇచ్చింది. శాకుంతలం సినిమాలో కూడా ఆమె చిన్నప్పటి భరతుడి పాత్రలో నటించి తన పాత్రతో మెప్పించిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో అల్లు అర్హ పోస్టులకు లక్షల్లో లైకులు, కామెంట్లు వర్షం కురుస్తూ ఉంటుంది.