Moviesఅల్లు అర్జున్ ఇంత సెంటిమెంటల్ ఫెలోనా..? ఇప్పటికి అవి ఫాలో అవుతాడా..?

అల్లు అర్జున్ ఇంత సెంటిమెంటల్ ఫెలోనా..? ఇప్పటికి అవి ఫాలో అవుతాడా..?

సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు సెంటిమెంట్లను ఫాలో అవుతూ ఉంటారు . కానీ ఆ విషయాన్ని బయటికి చెప్పుకోరు . కానీ కొంతమంది హీరోలు మాత్రం మేం పలానా సెంటిమెంట్లను ఫాలో అవుతాం.. మాకు ఇది కలిసి వస్తుంది అంటూ ఓపెన్ గా చెప్పుకొస్తూ ఉంటారు. ఆ లిస్టులోకే వస్తాడు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్. ప్రెసెంట్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా వైడ్ పాపులారిటీ సంపాదించుకొని త్వరలోనే పుష్ప2 సినిమా ద్వారా గ్లోబల్ వైడ్ గుర్తింపు సంపాదించుకొని అవార్డులను కొల్లగొట్టడానికి రెడీగా ఉన్న అల్లు అర్జున్ తన కెరీర్లో ఎక్కువగా రెండు సెంటిమెంట్లను బాగా ఫాలో అవుతూ ఉంటారట .

మరి ముఖ్యంగా సినిమాల విషయంలో రెండు సెంటిమెంట్లను ప్రధానంగా పాటించడానికి ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటారట . ఆ రెండు సెంటిమెంట్లు మరేవో కాదు ఒకటి ఏప్రిల్ నెల ..మరొకటి వైజాగ్. ఆయన నటించిన సినిమాలు ఏప్రిల్ నెలలో రిలీజ్ అయితే కచ్చితంగా ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ .. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుందని నమ్మకం అల్లు అర్జున్ కి ఉందట.

ఇప్పటివరకు ఆయన కెరియర్ లో నటించిన సినిమాలలో దాదాపు 6 సినిమాలకు పైగా ఏప్రిల్ నెలలో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టించాయి . అదేవిధంగా ఆయన నటించిన సినిమాలలో వైజాగ్ కి సంబంధించిన ఒక్క సీన్ కానీ ఒక బిట్ కాని కనిపిస్తే ఖచ్చితంగా సినిమా చరిత్రను తిరగరాస్తుందని.. హిట్ పక్కా అని అల్లు అర్జున్ బాగా నమ్ముతాడట . ప్రస్తుతం ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news