సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలకి హీరోయిన్లకి ఏ విధమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా కొంతమంది అభిమానులు అయితే టూ మచ్ కు వెళ్ళిపోతూ ఉంటారు . వీళ్ళు మా ఫేవరెట్ హీరో అని వీళ్ళు ఇలాంటి పనులు చేయకూడదు అలాంటి పనులు చేయకూడదు అంటూ హీరోలకే రిస్ట్రిక్షన్స్ పెట్టే అంత ఓవర్ చేస్తూ ఉంటారు కొంతమంది అభిమానులు . కాకపోతే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలాంటివి కూసింత ఎక్కువగానే ఉంటాయి . కాగా అందాల ముద్దుగుమ్మ మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ కి సైతం ఇలాంటి కండిషన్స్ పెట్టి కోపం తెప్పించారు అభిమానులు.
మనకు తెలిసిందే ఐశ్వర్యారాయ్ అందగత్త ..అంతకుమించిన గొప్ప నటి ..ఎలాంటి రోల్స్ నైనా అవలీలగా నటించేస్తుంది. అయితే గతంలో ధూమ్ 2 సినిమాలో హృతిక్ రోషన్ కి డైరెక్ట్ లిప్ లాక్ ఇచ్చి అభిమానుల చేత బూతులు తిట్టించుకునింది ఐశ్వర్యరాయ్. అప్పటికే అభిషేక్ బచ్చన్ తో కమిట్ అయిన నువ్వు ఎలా వేరే హీరోకి లిప్ లాక్ ఎలా ఇవ్వగలవు..? అంటూ మండిపడ్డారు . అంతేకాదు ఏకంగా ఆమెకు లీగల్ నోటీస్ కూడా పంపించారు . “మేమందరం మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటున్నామని .. మరి మీలాంటి ఆదర్శవంతరాలైన హీరోయిన్ ఇలాంటి దరిద్రమైన పనులు ఎలా చేస్తుందని .. ఇకపై అలా చేస్తే ఊరుకోమంటూ ఏకంగా లీగల్ నోటీసులే పంపించారు కొంతమంది అభిమానులు”.
ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఐశ్వర్య రాయ్ ఫైర్ అయిపోయింది. ” నేను ఓ నటిని ఆ పాత్రకు తగ్గట్టు నేను నటించాల్సి వస్తుంది.. అలా చేయకూడదు ఇలా చేయకూడదు అని నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు ..పాత్రకి తగ్గట్టు ముందుకు వెళుతూ ఉంటాను “అంటూ క్లారిటీ ఇచ్చింది. అయితే కొంతమంది మాత్రం ఆయన మొగుడు అభిషేక్ బచ్చన్ పట్టించుకోలేదు మధ్యలో మీకేంట్రా నొప్పి..? అంటూ దారుణంగా కామెంట్స్ చేసినారు . అయితే ఆ తర్వాత ఐశ్వర్యరాయ్ అలాంటి సీన్స్ లో నటించకపోవడం గమనార్హం . కాగా రీసెంట్ గానే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఐశ్వర్య రాయి పోనియన్ సెల్వన్ 1,2 లో నటించింది . అయితే ఇప్పటివరకు మరో సినిమా కమిట్ అవ్వలేదు అందాల ముద్దుగుమ్మ ఐశ్వర్య ..!!