Moviesమరోసారి విజయ్ తో రొమాన్స్ చేయబోతున్న సమంత.. ఏ సినిమాలో అంటే..?

మరోసారి విజయ్ తో రొమాన్స్ చేయబోతున్న సమంత.. ఏ సినిమాలో అంటే..?

సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ ఎక్కడ చూసినా సరే టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ సమంత పేర్లు మారుమ్రోగిపోతున్నాయి. దానికి కారణం ఖుషి సినిమా. మల్టి టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 1న గ్రాండ్ గా రిలీజ్ అయి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ టాక్ ని నమోదు చేసుకుంది . అంతేకాదు హ్యూజ్ ప్రాఫిట్స్ కూడా సినిమాకు తీసుకొచ్చింది . ఈ క్రమంలోనే సినిమాలో సమంత – విజయ్ ల రొమాన్స్ చాలా హైలెట్గా నిలిచింది.

అంతేకాదు సమంత – విజయ్ దేవరకొండ మరోసారి తెరపై కలిసి నటిస్తే చూడాలి అంటున్నారు విజయ్ ఫ్యాన్స్. ఈ క్రమంలోనే అలాంటి అభిమానులకు త్వరలోనే గుడ్ న్యూస్ రాబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం గౌతం తిన్నూరు దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమా లో హీరోయిన్గా సమంత సెలెక్ట్ అయినట్లు ప్రచారం జరుగుతుంది .

ఆల్రెడీ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా సెలెక్ట్ అయింది . అయితే తెరపై వీళ్ళ రొమాన్స్ వర్కౌట్ అవ్వడంతో ఈ సినిమాలో సమంత హీరోయిన్గా చూస్ చేసుకుంటున్నారట మేకర్స్. నిజానికి సమంత సినిమాలకు బ్రేక్ చెప్పి అమెరికా వెళ్ళింది . కానీ ఖుషి సినిమా ఇంత హ్యూజ్ సక్సెస్ అవ్వడంతో సమంత ఈ సినిమాలో నటించడానికి ఓకే చేసిన్నట్లు సమాచారం అందుతుంది . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news