Moviesపౌర్ణమి తరువాత త్రిషతో రెండు సార్లు నటించే ఛాన్స్ వచ్చిన రిజెక్ట్...

పౌర్ణమి తరువాత త్రిషతో రెండు సార్లు నటించే ఛాన్స్ వచ్చిన రిజెక్ట్ చేసిన ప్రభాస్.. రెండు సూపర్ హిట్ మూవీలే..!!

నిజంగానే ప్రేమించుకున్నారో లేక ఉత్తుత్తినే ప్రేమించుకున్నారో తెలియదు కానీ.. హీరో ప్రభాస్ హీరోయిన్ త్రిష ప్రేమించుకున్నారు అన్న వార్త మాత్రం ఇండస్ట్రీలో మారు మ్రో గిపోయింది . అయితే హీరోయిన్ త్రిష కేవలం ప్రభాస్ ని కాదు మరో హీరో దగ్గుబాటి రానాని కూడా ప్రేమించింది అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది . ఈ కారణంగానే ఇద్దరు హీరోలు వదిలేసారట. అయితే ప్రభాస్ – త్రిష కాంబినేషన్లో మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి . మూడు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి . కాగా సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఆ తర్వాత త్రిషతో ప్రభాస్ సినిమా చేసే ఛాన్స్ రెండుసార్లు వచ్చింది ..రెండుసార్లు ఆఫర్ ని మిస్ చేసుకున్నారట .

ఆ రెండు ఆఫర్స్ మరేవో కాదు బాహుబలి – రాధేశ్యామ్.. ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నా త్రిషకు బాహుబలి సినిమాలో తమన్నా పాత్ర చేసే ఛాన్స్ వచ్చిందట . కానీ ప్రభాస్ ఆమె ఆ పాత్రకు వద్దు అంటూ ఆయన సజెస్ట్ చేశారట. ఆ పాత్రకి ఎవరైనా యంగ్ ఫ్రెష్ ఫేస్ అయితే బాగుంటుంది అంటూ రాజమౌళితో చెప్పగా పరిస్థితిని అర్థం చేసుకున్న రాజమౌళి త్రిష ను ఆరోల్ నుండి తప్పించి మరీ ఆ రోల్ తమన్నకు ఇచ్చినట్లు తెలుస్తుంది .

ఆ తర్వాత రాధేశ్యామ్ సినిమాలో పూజ హెగ్డే పాత్ర తో పాటు మరో హీరోయిన్ పాత్ర కూడా ఉండాలట . ఆ హీరో ఆ పాత్ర కోసం త్రిషని చూస్ చేసుకున్నారట . అక్కడ కూడా ప్రభాస్ ఆ హీరోయిన్ వద్దు వేరే హీరోయిన్ చూస్ చేసుకుంటాం అని చెప్పగా పరిస్థితి అర్థం చేసుకున్న డైరెక్టర్ రాధాకృష్ణ ఏకంగా రోల్ నే ఎత్తేసారట . అలా రెండు సినిమాలు చేసే ఛాన్స్ ప్రభాస్ తో మిస్ చేసుకున్నింది త్రిష . ఒక్కసారి మోసం చేస్తే తన వారిని దరిదాపుల్లో కూడా ఉంచడు ప్రభాస్ అన్న మాట మాత్రం వాస్తవమని దీనితో తెలిసిపోతుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news