నందమూరి నటసింహ బాలయ్యకు తెలుగు ప్రజల్లో ఎలాంటి అభిమానం ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక స్టార్ హీరో నటించిన రెండు సినిమాలు ఒకేరోజు విడుదల కావటం సామాన్య విషయం కాదు. ఎంతో స్టార్ డం ఉండి నెంబర్ వన్ హీరోగా ఉన్న ఒక హీరో సోలోగా నటించినా రెండు సినిమాల ఒకేరోజు రిలీజ్ కావడంతో పాటు రెండు శత దినోత్సవాలు జరుపుకోవటం ఇండియన్ సినిమా హిస్టరీలోనే అరుదైన రికార్డుగా నిలిచిపోయింది.
ఆ హీరో మన బాలయ్య కాగా ఆ సినిమాలు బంగారు బుల్లోడు – నిప్పురవ్వ. హాలీవుడ్ స్థాయిలో అప్పటివరకు వచ్చిన సినిమాలను తలపించేలా అత్యధిక వ్యయంతో తెరకెక్కిన తొలి సినిమాగా రికార్డులకి ఎక్కింది. నిప్పురవ్వ ఈ సినిమాలో విజయశాంతి హీరోయిన్గా నటించగా కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమా రెండు వారాలకి రెండు కోట్ల రూపాయల షేర్ రాబట్టింది.
ఇక రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ రవీనాటాండన్, రమ్యకృష్ణ హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా బంగారు బుల్లోడు. ఈ సినిమా కూడా సెప్టెంబర్ మూడవ తేదీనే రిలీజ్ అయింది. ప్రపంచ సినీ చరిత్రలో నందమూరి తారకరామారావు – శోభన్ బాబు తర్వాత అలాంటి అరుదైన రికార్డు బాలయ్యకు మాత్రమే దక్కింది. ఇక ఈ రెండు సినిమాలు రిలీజ్ అయిన రోజున ఆంధ్రా, తెలంగాణలో ఉన్న 90% థియేటర్లలో బాలయ్య బాబు సినిమా ఆడటం విశేషం.
ఎంతో క్రేజ్‌తో వచ్చిన నిప్పురవ్వ సినిమాకు ఏఆర్ రెహమాన్ ఫస్ట్ టైం తెలుగులో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసిన సినిమా కావటం విశేషం. నిప్పురవ్వ బెనిఫిట్ షోలు అయితే అరాచకం క్రియేట్ చేశాయి. బెజవాడలో ఉదయం నాలుగు గంటలకు 11 థియేటర్లలో బెనిఫిట్ షోలు వేశారు. అప్పట్లో వంద రూపాయల టికెట్ పెట్టగా అన్ని బెనిఫిట్ షోలు హౌస్ ఫుల్ అయ్యాయి.
అప్పట్లో నిప్పురవ్వ – బంగారు బుల్లోడు సినిమాల రిలీజ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక పండగలా రిలీజ్ అయింది. హైదరాబాద్ లో 44 థియేటర్లలో ఈ రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక అన్నగారి సినిమాలు.. బాలయ్య సినిమాలు రెండు కూడా రాజమండ్రిలోనే శత దినోత్సవం జరుపుకోవడం విశేషం. బంగారు బుల్లోడు రాజమండ్రి మేనక థియేటర్లో – నిప్పురవ్వ శివ జ్యోతి థియేటర్లో శత దినోత్సవం జరుపుకున్నాయి. ఈ రెండు సినిమాలు 30 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం విశేషం.