సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి.. ఇక వాటిలో దూకుడు సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. 2011 సెప్టెంబర్ 23న విడుదలైన ఈ సినిమా ఆ సంవత్సరం విడుదలైన బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది. మొన్నటితో ఈ సినిమా 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. పోకిరి సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన మహేష్ కు వరుస అపజయాలు వచ్చాయి.. సైనికుడు, అతిథి, ఖలేజా సినిమాలు బాగా నిరాశపరిచాయి. ఆ సమయంలో దూకుడు సినిమా మహేష్ కు సక్సెస్ ఇచ్చింది.
దర్శకుడు శ్రీనువైట్ల కామెడీ యాక్షన్, రొమాన్స్, ఎమోషన్ కలగలిపి పక్క కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు. ఈ సినిమాలో బ్రహ్మానందం కామెడీ సినిమాకే హైలైట్.. అలాగే ఎమ్మెస్ నారాయణ సైతం తన కామెడీతో చెలరేగిపోయాడు. సమంతతో మహేష్ కెమిస్ట్రీ అదిరిపోయింది. తమన్ సాంగ్స్ అందరినీ ఆకట్టుకున్నాయి.
ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయం మాత్రం బయటకు వచ్చింది. దర్శకుడు శ్రీనువైట్ల హీరో తండ్రి పాత్రకు ముందుగా దివంగత నటుడు శ్రీహరినిని అనుకున్నారట. హీరోగా అవకాశాలు తగ్గిన శ్రీహరి అప్పటికే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తున్నాడు. దాంతో ఈ సినిమాకు కీలకమైన తండ్రి రోల్ చేయమని శ్రీహరిని అడిగారట. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి బిజీగా ఉన్న శ్రీహరి అందుకు ఒప్పుకోలేదట.
ఈ సమయంలో ఫాదర్ రోల్ చేస్తే ఇకపై తనకు అలాంటి పాత్రలే వస్తాయి సపోర్టింగ్ రోల్స్ సెకండ్ హీరో స్థాయి నుంచి మరింత తన క్యారెక్టర్లు పడిపోతాయని దర్శకుడు శ్రీను వైట్ల ఇచ్చిన ఆఫర్ వదులుకున్నారట. అదే సమయంలో మీరు చేస్తానంటే తండ్రి పాత్రను.. అన్నయ్య పాత్రగా మారుస్తామని కూడా అన్నారట.. అయినా శ్రీహరి అందుకు ఒప్పుకోలేదట. దర్శకుడు శ్రీనువైట్ల కూడా అన్నయ్యగా మారిస్తే సెంటిమెంట్ అంతగా వర్క్ అవుట్ కాదునుకున్నారట. దాంతో శ్రీహరిని తీసుకోవాలనే ఆలోచనను వదులుకున్నారట.
శ్రీహరి ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో ఆ పాత్రకు ప్రకాష్ రాజ్‌ని తీసుకున్నారు. ఇక ప్రకాష్ రాజ్ నటన గురించి అందరికీ తెలిసిందే. తాను ఏదైనా పాత్ర ఒప్పుకుంటే ఆ పాత్రకు 100% నాయం చేస్తాడు. దూకుడు సినిమా ఓ రివేంజ్ డ్రామా అన్న విషయం తెలిసిందే. ఇక హీరో తండ్రిని చంపాలని చూసిన విలన్లను హీరో ఎలా అంతం చేశాడన్న కథ.. ఈ కథతో వచ్చిన దూకుడు బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపి మహేష్ కెరియర్ కు మంచి బూస్ట్ నిచ్చింది. దూకుడు సినిమాతో మహేష్ మరోసారి టాలీవుడ్‌కు సూపర్ స్టార్ అని నిరూపించుకున్నాడు.