Newsడైరెక్టర్ లైలాపై పడి ఏడ్చేసిన హీరోయిన్ ల‌య‌... అస‌లేం జ‌రిగింది...!

డైరెక్టర్ లైలాపై పడి ఏడ్చేసిన హీరోయిన్ ల‌య‌… అస‌లేం జ‌రిగింది…!

ఎగిరే పావురమా సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది యాక్ట్రెస్ లైలా. తర్వాత పెళ్లి చేసుకుందాం, శుభలేఖలు, మిస్టర్ అండ్ మిసెస్ శైలజ కృష్ణమూర్తి వంటి సక్సెస్‌ఫుల్ సినిమాల్లో నటించి తెలుగువారిని ఎంతగానో మెప్పించింది. 2006లో ఇరానీ వ్యాపారవేత్త అయిన మెహదీని పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమయింది. అంతకుముందు ఆమె తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ, హిందీ సినిమాల్లో యాక్ట్ చేసింది. మళ్లీ ఈ గోవా బ్యూటీ 2022లో వదంతి వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

తమిళ్ మూవీ ‘సర్దార్’తో సిల్వర్‌స్క్రీన్‌పై రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ‘శబ్దం’ అనే కోలీవుడ్ సినిమాలో నటిస్తోంది. ఈ క్రమంలోనే యూట్యూబ్‌ ఛానల్‌కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో తాను ఒక డైరెక్టర్ కాళ్ళపై పడి క్షమాపణలు కోరానని చెప్పి అందర్నీ నివ్వెరపరిచింది. ఇంతకీ ఎవరా డైరెక్టర్? ఎందుకు కాళ్లపై పడాల్సిన పరిస్థితి వచ్చింది?

లైలా 2001లో వచ్చిన తమిళ సినిమా ‘నందా’లో ఫిమేల్ లీడ్ రోల్ పోషించింది. ఈ సినిమాకు బాల దర్శకత్వం వహించాడు. యాక్షన్ డ్రామా మూవీగా వచ్చిన ఈ సినిమాలో గజినీ ఫేమ్ సూర్య హీరోగా నటించాడు. అయితే ఆ సినిమా తీసే నాటికి లైలాకి పెద్దగా తమిళ్ భాష వచ్చేది కాదు. దానివల్ల డైలాగులు చెప్పే సమయంలో చాలా తప్పులు చెప్పేది. ఆమె తప్పులను చూసి డైరెక్టర్ బాల బాగా ఆగ్రహించేవాడు.

అయినా ఆమె తప్పుతప్పుగా డైలాగులు చెబుతుండటంతో బాల ఆమెను ఇష్టం వచ్చినట్టు తిట్టడం ప్రారంభించాడు. పదే పదే అతను తిడుతుండటంతో ఈ ముద్దుగుమ్మకు చాలా కోపం వచ్చేదట. ఆ విషయాన్ని లైలా తాజా యూట్యూబ్ ఇంటర్వ్యూలో తెలిపింది.

ఆమె ఈ సంఘటన గురించి మాట్లాడుతూ.. “డైరెక్టర్ బాల తిడుతూ ఉంటే కోపాన్ని అణుచుకునే దాన్ని. కానీ ఒకరోజు అతడు తిట్టిన తిట్లకు నాకు కోపం కట్టలు తెంచుకుంది. దాంతో అతడి మీదే అరిచేశా, సినిమా మధ్యలోనే వదిలేస్తానని వార్నింగ్ కూడా ఇచ్చా. నేను అలా కోపంతో ఊగిపోవడానికి చూసి చాలామంది షాక్ అయ్యారు. మరికొంతమంది వచ్చి నాకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. బాల దర్శకత్వంలో సినిమా చేస్తే మంచి పేరు, ప్రఖ్యాతలు వస్తాయని వారు చెప్పారు. దాంతో నేను శాంతించాను. ఆ సినిమా పూర్తి చేశాను…”

“కొద్ది రోజులకు నందా మూవీ థియేటర్లో రిలీజ్ అయింది. దానిని చూసేందుకు నేను సినిమా హాల్ కి వెళ్లాను. ఆ సమయంలో నా నటన చూసి ప్రేక్షకులు, ఈలలు అరుపులతో చేసిన గోల చూసి నాకు ఎంతో సంతోషం వేసింది. నేను ఇంత బాగా నటించానా? అనే డౌట్ నాకు కలిగింది. అంత బాగా యాక్ట్ చేయడానికి కారణం డైరెక్టర్ బాల అని అప్పుడు రియలైజ్ అయ్యాను. తిట్టినా నాపై కోప్పడినా అది ఒక మంచి కారణం కోసమేనని అర్థం చేసుకున్నాను. అందుకే సినిమా చూసిన వెంటనే డైరెక్టర్ బాల దగ్గరకి వెళ్లి ఆయన కాళ్లపై పడ్డాను. ‘మీ కోపం ఎందుకో నాకు అర్థం అయింద’ని చెబుతూ క్షమాపణలు చెప్పాను. ఆ సినిమాలోని నా నటనకు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు కూడా వచ్చింది.” అని లైలా ఆసక్తికర ఘటన గురించి తెలియజేసింది.

ఈ చిత్రం తెలుగు భాషలో మూడుసార్లు డబ్ అయింది. మొదట ఆక్రోశం (2006)గా, తరువాత 2009లో ప్రతీకారంగా, 2011లో బాల-సూర్యగా ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను పలకరించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news