బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో అభిషేక్ బచ్చన్ కు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ వన్ అండ్ ఓన్లీ సన్ .. అభిషేక్ బచ్చన్ . హీరోయిన్ ఐశ్వర్య రాయిను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు . వీళ్ళ ప్రేమాయణం అందరికీ తెలిసిందే. పెళ్లి తర్వాత వీళ్ళు ఎలా ఉంటున్నారో కూడా మనందరికీ బాగా తెలుసు . కాగా ఈ మధ్య ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ తెగ ప్రచారం జరిగింది .
అయితే ఆ వార్తలో వాస్తవం లేదు అంటూ చాలా సార్లు క్లారిటీ ఇచ్చాడు అభిషేక్ బచ్చన్ . కాగా అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యరాయ్ లను దగ్గర నుంచి క్లోజప్ గా వాచ్ చేసే వాళ్ళకి ఇంట్లో పెత్తనం అంత ఐశ్వర్య రాయ్ దే అన్న విషయం తెలిసే ఉంటుంది . ఇదే క్రమంలో రీసెంట్గా అభిషేక్ బచ్చన్ అదే విషయాన్ని కన్ఫర్మ్ చేశాడు. రీసెంట్గా బిగ్ బి వారసురాలు టీనేజ్ లోకి అడుగుపెట్టడంతో పేరంటింగ్ టిప్స్ గురించి పంచుకోవాలని అంటూ మీడియా సంస్థ అభిషేక్ బచ్చన్ ని కోరింది .
దీంతో అభిషేక్ బచ్చన్ స్పందిస్తూ ..”పేరంటింగ్ విషయానికి వస్తే ఇంట్లో తనదేమీ పెద్ద పాత్ర కాదని .. ఇంట్లో అంతా ఐశ్వర్యరాయ్ చూసుకుంటుంది అని .. ఈ వ్యవహారాలన్నీ ఆమె చక్కబెడుతుంది అని చెప్పుకొచ్చారు “. అంతేకాదు “మీ అందరికీ తెలిసిందే ఇంట్లో ఆమెదే పెత్తనం అనేలా కామెంట్స్ చేసారు. దీంతో సోషల్ మీడియాలో ఇవే కామెంట్స్ వైరల్ గా మారాయి. ఐశ్వర్యరాయ్ గురించి అభిషేక్ బచ్చన్ ఎంతో పాజిటివ్ గా చేసిన కామెంట్స్ కూడా ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి..!!