హాస్య నటుడు అలీ.. గురించి అందరికీ తెలిసిందే. ఆయన చిన్న వయసు నుంచే ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నారు. అయితే.. అలీ నిజజీవితంలోనూ కమెడియన్‌గా అనేక మంది భావించేవారట. సీతాకోక చిలుక సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అలీ.. తమిళ సినిమాల్లో చాలా పాత్రలు వేశారు. అవన్నీ బాల నటుడిగానే కావడం విశేషం. అప్పట్లో తమిళ నిర్మాతలు.. బాల నటులకు. పెద్దగా రెమ్యునరేషన్ ఇచ్చేవారు కాదు.
వారికి బహుమతులు.. తిండి పెట్టి పంపేసేవారు.. కానీ, అలీ అలాకాదు. తన రెమ్యునరేషన్ విషయంలో చిన్నప్పటి నుంచి పట్టుబట్టేవారట. ఈ విషయం తెలిసి .. బాలచందర్.. ఎంతో మెచ్చుకుని.. ఇండస్ట్రీలో పైకొస్తావ్ ఇలానే ఉండు.. అని సలహాలు ఇచ్చేవారు. ఇది.. అలీని ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఆదుకుంది. అయితే.. ఒకటి రెండు సినిమాలకు సంబందించి నిర్మాతలు ఆయనను కూడా ఇబ్బంది పెట్టారట.
అలీది ఏముందండీ.. అయినా.. ఇప్పుడు డబ్బులు ఎందుకు? బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి పంపేయండి.. అని జెమినీ స్టూడియో నిర్మాతలు అనేవారట. ఈ విషయంపై అలీపెద్దగా మాట్లాడేవారు కాదు. దీనికి కూడా ఒక కారణం ఉంది.. ఒకటి రెండు రోజుల్లోనే అలీ పాత్రకు సంబందించిన షూటింగ్ అయిపోయేది. పట్టుబడతామంటే.. కుదిరేది కాదు. దీంతో అవకాశం కోసం చూసి.. అప్పుడు షూటింగులకు డుమ్మా కొట్టేవారట.
ఇది.. చివరకు వివాదం అయింది. అలీ కోసం వేసిన స్పాట్‌లకు ఆయనకు వచ్చేవారు కాదు. దీంతో షూటింగులు నిలిచిపోయేవి. ఇదే విషయంపై నిర్మాతలు చర్చించినప్పుడు.. అప్పుడు అలీ కూడా వారికి నొప్పి తెలియకుండానే చురకలు అంటించేవారట. మీరిచ్చిన బిర్యానీ తినేసరికి నిద్ర పట్టేసింది. దీంతో షూటింగుకు రాలేక పోయాను. అదే డబ్బులు ఇచ్చారనుకో.. ఇబ్బంది ఉండేది కాదుగా
అని చెప్పి.. తనను తాను మార్కెట్ చేసుకునేవారట.