Newsబిగ్ బ్రేకింగ్: బాలయ్య అభిమానులకు వెరీ వెరీ బ్యాడ్ న్యూస్..కోలుకోలేని షాక్..!?

బిగ్ బ్రేకింగ్: బాలయ్య అభిమానులకు వెరీ వెరీ బ్యాడ్ న్యూస్..కోలుకోలేని షాక్..!?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ నటసిం హం నందమూరి బాలయ్య నటించిన భగవంత్ కేసరి సినిమా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయ్యిందా..? అంటే అవునని సమాధానం సినీ ప్రముఖుల నుంచి వినిపిస్తుంది. మనకు తెలిసిందే ప్రజెంట్ బాలయ్య సినిమా షూట్ కి అటెండ్ అయ్యే పొజిషన్లో లేడు . తన బావ ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ భారీ కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడిగా అరెస్టు అయ్యారు.

ప్రజెంట్ ఆయన రాజమండ్రిలోని రాజమహేంద్రవరం జైల్లో ఉన్నారు . అయితే ప్రజెంట్ టిడిపి బాధ్యతలను పూర్తిగా తన భుజాలపై వేసుకున్నాడు బాలకృష్ణ. ఇలాంటి టైంలో బాలకృష్ణ సినిమాలో నటించే టైం లేదు . ఈ క్రమంలోనే ఆయన కమిట్ అయిన సినిమాలు కూడా ఆగిపోయే పరిస్థితి నెలకొనింది. మరీ ముఖ్యంగా భగవంత్ కేసరి సినిమా రిలీజ్ డేట్ కూడా అఫీషియల్ గా ప్రకటించేశారు చిత్ర బృందం . అయితే ఇంకా ఈ సినిమాకి సంబంధించిన 20% షూటింగ్ చిత్రీకరణ మిగిలే ఉందట. అయితే బాలయ్య ఇప్పుడు షూట్ కి వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఈ సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ చేయలేమంటూ మేకర్స్ మరో రిలీజ్ డేట్ ను సిద్ధం చేసుకుంటున్నారట .

త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా ప్రకటించబోతున్నారు అంటూ తెలుస్తుంది . దీంతో సోషల్ మీడియాలో నందమూరి ఫ్యాన్స్ బాధపడిపోతున్నారు . ఈ సినిమా ద్వారా బాలయ్య మరో హిట్ తన ఖాతాలో వేసుకుంటాడని పక్కగా ఫిక్స్ అయిపోయారు జనాలు. కానీ లాస్ట్ మూమెంట్లో ఇలా ఊహించని పరిణామాల మధ్య బాలయ్య ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నిజంగా షాకింగ్ గా ఉందని చెప్పుకొస్తున్నారు . మొత్తానికి బాలయ్య ఏ నిర్ణయం తీసుకున్న బాగా ఆలోచించి తీసుకుంటారన్న భావన అందరికీ ఉంది . ఈ నిర్ణయం వెనక కూడా ఏదో మంచి ప్లానే ఉండి ఉంటుంది అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news