Movies"ఇక గుడ్ బై"..తమన్నా అభిమానుల గుండెలు పగిలిపోయే న్యూస్ ఇది..!?

“ఇక గుడ్ బై”..తమన్నా అభిమానుల గుండెలు పగిలిపోయే న్యూస్ ఇది..!?

అవునండి.. ఇప్పుడు ఇదే వార్త సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ లోకి వచ్చింది . టాలీవుడ్ ముల్కీ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ తమన్నా సోషల్ మీడియాకు దూరం కాబోతుందా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . దానికి కారణం జనాలే . ఈ మధ్యకాలంలో తమన్నాకు సంబంధించిన వార్తలను .. ఏ విధంగా నెగిటివ్గా ట్రోల్ చేశారో మనం చూసాం. మరీ ముఖ్యంగా ఎప్పుడైతే ఆమె బాలీవుడ్ నటుడు విజయ్ వర్మను ప్రేమిస్తుందని .. ఆయనతో డేటింగ్ చేస్తుందని చెప్పుకొచ్చిందో అప్పటినుంచి ఆమెకు సంబంధించిన పలురకాల వార్తలను హ్యుజ్ రేంజ్ లో ట్రోల్ చేశారు .

మరీ ముఖ్యంగా ఆమె పర్సనల్ విషయానికి కూడా వెళ్లి దారుణంగా మాట్లాడారు . కొంతమంది ఆమె విజయ్ వర్మను పెళ్లి చేసుకోదని.. కేవలం బంచిక్ బం కోసమే ప్రేమిస్తున్నానని యాక్ట్ చేస్తుందని .. ఆ మోజు తీరిపోయాక దూరం పెట్టేస్తుందని కామెంట్ చేశారు. అంతేకాదు మరి కొంతమంది హద్దులు మీరిపోయి తమన్నా పర్సనల్ విషయాలను కూడా ఇబ్బందికరంగా అసభ్యకరంగా ట్రోల్ చేశారు. దీంతో ఇలాంటి వాటి నుంచి స్ట్రెస్ గా ఫీల్ అవ్వకుండా ప్రశాంతంగా ఉండాలి అంటే సోషల్ మీడియాకు దూరం కావడమే ది బెస్ట్ అంటూ ఆమె నిర్ణయం తీసుకుందట .

ఒకవేళ అదే నిజమైతే మాత్రం తమన్నా చాప్టర్ క్లోజ్ అనే చెప్పాలి . సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎదగాలి అంటే సోషల్ మీడియా కీ పాయింట్ . సోషల్ మీడియాకు దూరమైతే ఇక సినిమా ఇండస్ట్రీలో ఆమె పైకి ఎదగలేదు . అభిమానులతో టచ్ లో లేని ఏ హీరోయిన్ బాగుపడిన చరిత్ర ఇండస్ట్రీలో లేదు అంటున్నారు సినీ విశ్లేషకులు..!!

Latest news