Moviesనందమూరి ఫ్యాన్స్ చొక్కాలు చించుకుని.. కేక పెట్టి అరిచే అప్డేట్ ఇది..!!

నందమూరి ఫ్యాన్స్ చొక్కాలు చించుకుని.. కేక పెట్టి అరిచే అప్డేట్ ఇది..!!

ఒకవేళ నిజంగా ఇది నిజమైతే మాత్రం నందమూరి అభిమానులకు ఇంతకంటే మరో బిగ్ న్యూస్ లేదనే చెప్పాలి. ఎస్ కోట్లాదిమంది నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేస్తున్న మోక్షజ్ఞ ఎంట్రీ కి సంబంధించిన క్రేజీ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నందమూరి బాలకృష్ణ ప్రెసెంట్ భగవంత్ కేసరి అనే సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమాని మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావి పూడి తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమాలో కాజల్ హీరోయిన్గా నటిస్తుంది . ఈ సినిమాలో బాలయ్య కూతురు పాత్రలో శ్రీలీల నటిస్తుంది . రీసెంట్ గా ఈ సినిమా సెట్స్ లో బాలయ్య కొడుకు మోక్షజ్ఞ కనపడిన పిక్స్ వైరల్ గా మారాయి . అయితే మోక్షజ్ఞ ఈ సినిమా సెట్స్ లో ఊరికే టైం పాస్ చేయడానికి రాలేదని .. ఈ సినిమా ద్వారా ఓ స్పెషల్ కేమియో రోల్ లో కనిపించబోతున్నాడని .. తన తండ్రి సినిమాతోనే తన టాలీవుడ్ ఎంట్రీ ఉండాలని బలంగా ఫిక్స్ అయిన మోక్షజ్ఞ ఈ సినిమా ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని.. కేవలం ఈ సినిమాలో రెండంటే రెండు నిమిషాల పాత్రలో ఆయన నటించబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .

అయితే మొదటి నుంచి కొడుకుని చిన్నా చితకా రోల్ లో ఇంట్రడ్యూస్ చేయడం ఏమాత్రం ఇష్టం లేని బాలయ్య.. అనిల్ రావిపూడి సలహా మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది . దీనితో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది . మొత్తానికి తండ్రి కొడుకులను ఒకే తెరపై చూస్తే ఫ్యాన్స్ కు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో ప్రత్యేకంగా చెప్పాలా..? చొక్కాలు చించుకొని అరిస్తే కానీ ఆ మజా రాదు .ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news