Moviesమెగా కోడలు ట్యాగ్.. లావణ్య త్రిపాఠికి మూడు కోట్లు బొక్క ..ఎలా...

మెగా కోడలు ట్యాగ్.. లావణ్య త్రిపాఠికి మూడు కోట్లు బొక్క ..ఎలా అంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ లావణ్య త్రిపాటికి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిన విషయమే. స్టార్ హీరోయిన్ అని చెప్పలేం కానీ నటించిన ప్రతి సినిమాలో మంచి మార్కులు వేయించుకొని తన సినిమాకు పాజిటివ్ రివ్యూస్ దక్కించుకోవడంలో లావణ్య త్రిపాఠి ఎప్పుడు ముందు వరుసలోనే ఉంటుంది . కాగ రీసెంట్ గా లావణ్య త్రిపాఠి పులి మేక అనే వెబ్ సిరీస్ లో నటించి హిట్ కొట్టిన విషయం తెలిసిందే . ఆ తర్వాత హీరో వరుణ్ తేజ్ నిశ్చితార్ధం చేసుకుని మెగా ఇంటికి కోడలు ట్యాగ్ ని తగిలించుకుంది. ఏ ముహూర్తంలో మెగా ట్యాగ్ తగిలించుకుందో తెలియదు కానీ అప్పటినుంచి లావణ్య త్రిపాఠి పేరు ఇండస్ట్రీలో మారు మ్రోగిపోతుంది.

అంతేకాదు అందరూ ఇప్పుడు ఆమెను వరుణ్ తేజ్ భార్యగానే చూస్తున్నారు ..తప్పిస్తే హీరోయిన్ గా ఎవరూ చూడటం లేదు .అందుకే ఆమె ఎక్స్పోజ్ చేసిన ఫొటోస్ రిలీజ్ అయిన ఆమె ఎక్కడికెళ్ళినా.. ఆమెను అందరు మెగా కోడలు గానే గుర్తిస్తున్నారు. ఇలాంటి క్రమంలోనే మెగా కోడలు ట్యాగ్ తగిలించుకున్న లావణ్య త్రిపాఠి రీసెంట్గా మూడు కోట్లు నష్టపోయినట్లు తెలుస్తుంది . లావణ్య త్రిపాఠి నిశ్చితార్ధం కు ముందే ఓ వెబ్ సిరీస్ కి కమిట్ అయింది. ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మితం కానున్న ఓ సిరీస్ వెబ్ సిరీస్ కి ఫిక్స్ అయింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఎక్స్ క్లూజివ్ గా స్ట్రీమింగ్ అవ్వబోతుంది .

ఇందులో బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ హీరోగా నటించబోతున్నాడు . కాగా ఈ వెబ్ సిరీస్ లో హీరోయిన్గా లావణ్య త్రిపాఠి ఎంపికైంది . విశ్వకాండ రావు వెబ్ సిరీస్ ను ఫుల్ టు ఫుల్ రొమాంటిక్ సీన్స్ తో తెరకెక్కిస్తున్నారు. అయితే మరికొద్ది రోజుల్లోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది అని ఆశపడేలోపే ఈ వెబ్ సిరీస్ నుంచి లావణ్య తప్పుకున్నట్లు తెలుస్తుంది . అంతేకాదు అడ్వాన్స్ గా ఇచ్చినా అమౌంట్ మొత్తం రిటర్న్ చేస్తూ అగ్రిమెంట్ను క్యాన్సిల్ చేసిందట మెగా కోడలు . ఇలాంటి సిరీస్ లో నటిస్తే బాగోదు అని దాని వల్ల అత్తగారింటికి చెడ్డ పేరు వస్తుందని భావించిన ఈమె ఈ వెబ్ సిరీస్ నుంచి సైడ్ అయిందట. దీంతో లావణ్య కు మూడు కోట్లు బొక్క అంటూ జనాలు కామెంట్స్ చేస్తుంటే.. మరి కొంతమంది లావణ్య చేసింది పర్ఫెక్ట్ పని అని కచ్చితంగా మెగా ఇంటి పరువును లావణ్య నిలబడుతుందని చెప్పుకొస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news