ఇండస్ట్రీలో అడుగుపెట్టే ఏ హీరోయిన్ అయినా హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిపోవాలని… స్టార్ హీరోల సినిమాలలో జోడిగా నటించాలని కోరుకుంటుంది. పెద్ద సినిమాలకు చేస్తే నలుగురు దృష్టిలో పడొచ్చు.. ఆటోమేటిక్‌గా క్రేజ్ పెరుగుతుంది.. నాలుగు కాలాలపాటు ఇండస్ట్రీలో ఉండొచ్చు.. నాలుగు రాళ్లు వెనకేసుకోవచ్చు అన్న ఆశలు సహజంగానే ఉంటాయి. ఈ క్రమంలోనే యంగ్ హీరోయిన్ సాక్షి వైద్య ఎన్నో ఆశలతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది.
అయితే ఆమె ఆశలు అన్ని రెండు సినిమాలతో అడియాసలు అయిపోయాయి. అక్కినేని అఖిల్ కి జోడిగా ఏజెంట్ లాంటి పెద్ద సినిమాలో ఆఫర్ అందుకుంది. ఈ సినిమా టాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్ లలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా దెబ్బతో సాక్షి పని అయిపోయిందని అంతా అనుకున్నారు. ఏజెంట్ వచ్చిన వెంటనే మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన గాండీవ ధారి అర్జున సినిమా వచ్చింది. ఈ సినిమా కూడా అతిపెద్ద డిజాస్టర్ అయింది.
ఇలా వరుసగా ఇద్దరు క్రేజీ యంగ్ హీరోల సినిమాలలో నటించే అవకాశం రావడం.. రెండూ కూడా అతి పెద్ద డిజాస్టర్లు కావడంతో ఆమె కెరీర్ డైలమాలో పడింది. సహజంగా ఏ హీరోయిన్లకు అయినా కెరీర్ ప్రారంభంలో మంచి హిట్లు పడాలి.. కెరీర్ ప్రారంభంలోనే వరుస డిజాస్టర్లు రావడంతో ఆమెకు తర్వాత ఎవరైనా అవకాశాలు ఇచ్చేందుకు కాస్త వెనక ముందు ఆడుతూ ఉంటారు. ప్రస్తుతం ఆమె పవన్ కళ్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటించే అవకాశం అందుకుంది.
అయితే రెండు వరుస ప్లాపులతో ఆమెపై అందరూ ఐరన్ లెగ్ ముద్ర వేయడంతో ఇప్పుడు ఈ సినిమా నుంచి కూడా దర్శకుడు హరీష్ శంకర్ తప్పించేసినట్టు ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. మరికొందరు మాత్రం సినిమాలు ప్లాప్ అయితే సాక్షి మాత్రం ఏం ? చేస్తుంది.. ఆమెను పవన్ కళ్యాణ్ సినిమా నుంచి తప్పించడం ఆమెను మోసం చేసినట్టే అని గుసలాడుకుంటున్నారు.