దసరాకు పోటాపోటీగా మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో రెండు తెలుగు హీరోల సినిమాలు అయితే.. ఒకటి తమిళ్ స్టార్ హీరో సినిమా. దసరాకు వస్తున్న సినిమాలలో బాలయ్య భగవంత్ కేసరి – రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాలు ఉన్నాయి. అలాగే విజయ్ లియో సినిమా కూడా ఉంది. గతంలో 3 – 4 సార్లు రవితేజ, బాలయ్య సినిమాలు ఒకేసారి రిలీజ్ అయినప్పుడు రవితేజది పై చేయి అయింది.
అయితే ఈసారి ఆ సెంటిమెంట్ వర్క్ అవుట్ కాకపోవచ్చు అనే ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈసారి రెండు సినిమాలు ఒక రోజు గ్యాప్ తో విడుదలవుతున్నాయి. పైగా గతంలో బాలయ్య సినిమాలు వేరు.. ఇప్పుడు వేరు బాలయ్య క్రేజ్ చాలా బాగా పెరిగింది. బాలయ్య కథల ఎంపికలు చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నారు పైగా అనిల్ రావిపూడికి వరుసగా 6 సూపర్ డూపర్ హిట్లు.. అసలు అపజయం అన్నదే లేదు.
అలాంటి దర్శకుడు బాలయ్యతో భగవంత్ కేసరి తెరకెక్కిస్తున్నాడు అనగానే అంచనాలు మామూలుగా లేవు. పైగా బాలయ్య అఖండ – వీరసింహారెడ్డి లాంటి రెండు సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో కెరీర్ లోనే ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. భగవంత్ కేసరి టీజర్ అరాచకం క్రియేట్ చేసింది. ఇక రవితేజ విషయానికి వస్తే ప్రస్తుతం వరుస ప్లాపులతో కొట్టుమిట్టాడుతున్నాడు. టైగర్ సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాలి.. లేకపోతే రవితేజను టాలీవుడ్ జనాలు మరిచిపోయే ప్రమాదం కూడా ఉంది.
టైగర్ టీజర్ వరకు చూసుకుంటే దర్శకుడు వంశీకృష్ణ కష్టపడినట్టుగా కనిపిస్తోంది. వంశీకృష్ణకు పెద్దగా ట్రాక్ రికార్డు కూడా ఏమీ లేదు. ఈ సినిమాతోనే దర్శకుడు వంశీ ప్రూవ్ చేసుకోవాల్సింది చాలా ఉంది. ఓవరాల్ గా చూస్తే ఈసారి రవితేజ సినిమా కంటే బాలయ్య సినిమాకి ఎక్కువ ఫ్లస్‌లు కనిపిస్తున్నాయి. వీరిద్దరి మధ్య పోటీగా సినిమాతో మధ్యలో దూకుతున్నాడు. ఏది ఏమైనా మరి ఈ పోటీలో ఎవరి సినిమాపై చేయి సాధిస్తుందో దసరాకు తేలిపోనుంది.