మన తెలుగులో ఓ సామెత ఉంది. ఆకాశమంత అందం ఉన్నా ఆవ గింజ అంత అదృష్టం దానికి తోడై ఉండాలని అంటారు. లేకపోతే ఆ అందం అంతా కూడా అడవి కాచిన వెన్నెల అవుతుంది. ఇది మన తెలుగు హీరోయిన్లకు కూడా కొంత వరకు వర్తిస్తుంది. ఎప్పుడు అయితే శ్రీలీల ఎంట్రీ ఇచ్చిందో పూజాహెగ్డే, రష్మిక, కృతిషెట్టి లాంటి హీరోయిన్ల ఛాన్సులకు గండిపడింది. అంతకంటే ముందే రాశిఖన్నా కెరీర్ ఫేడవుట్‌కు చేరుకుంది.
పక్కా కమర్షియల్, థ్యాంక్యూ లాంటి రెండు పెద్ద డిజాస్టర్ల తర్వాత రాశిని పట్టించుకునే వాళ్లే లేరు. ఇక నభా నటేష్, నిధి అగర్వాల్ ఇస్మార్ట్ శంకర్ తోనే జనాలు మర్చిపోతున్నారు. నిధికి పవన్ హరిహర వీరమల్లుపై ఆశలు ఉన్నా అసలు ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియట్లేదు. ఇక నభా నాలుగు సినిమాలు చేస్తే అన్నీ ప్లాపులే. ఇక నివేత పెతురాజ్, మెహ్రీన్ కూడా అందం ఉన్నా స్టార్ హీరోయిన్లు కాలేదు.
ఇక అను ఎమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్ వరుసగా ప్లాపులు ఇస్తున్నారు. అనుకు పవన్ అజ్ఞాతవాసిలో ఛాన్స్ వచ్చినా డిజాస్టర్. ఇక మేఘా వరుసగా 4 ప్లాపులు ఇచ్చింది. ఇక లావణ్య వరుణ్‌ను పెళ్లాడేస్తే సినిమాలకు గుడ్ బై చెప్పేసినట్టే అనుకోవాలి. రీతూవర్మకు టాలెంట్ అందం ఉన్నా కూడా అవకాశాలు లేవు. ఏదేమైనా ఈ హీరోయిన్లకు అందంతో పాటు అభినయం ఉండి కూడా హిట్లు లేక, స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు లేక రేసులో వెనకపడిపోయారు.