Moviesతన 23ఏళ్ల కెరీర్ లో..మహేష్ ఒక్క రీమేక్ సినిమాలో కూడా ఎందుకు...

తన 23ఏళ్ల కెరీర్ లో..మహేష్ ఒక్క రీమేక్ సినిమాలో కూడా ఎందుకు నటించలేదో తెలుసా..? దట్ ఈజ్ ఘట్టమనేని హీరో..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో రీమేక్ తంతు ఎక్కువగా జరుగుతూ వస్తుంది . సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు అందరూ కూడా పక్క భాషలో హిట్ అయిన వాళ్లపై కన్నేస్తున్నారు . పక్క భాషలో సినిమాలను మళ్లీ మన భాషలోకి రీమేక్ చేస్తూ అక్కడక్కడ చేంజస్ చేసి రిలీజ్ చేస్తున్నారు. అయితే కొన్ని సినిమాలు అలా చేస్తే హిట్ అవ్వగా.. మరి కొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి . ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో ఉండే చాలా స్టార్స్ చాలామంది ఇదే ప్రాసెస్ ను ఫాలో అవుతున్నారు .

చిరంజీవి – పవన్ కళ్యాణ్ – రామ్ చరణ్ ఇలా టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు అందరూ చాలా వరకు రీమేక్ చిత్రాలపై కన్నేశారు. కానీ ఇప్పటివరకు మహేష్ బాబు తన కెరియర్ లో ఒక్కటంటే ఒక్క రీమేక్ చిత్రంలో కూడా నటించలేదు. కనీసం డబ్ కూడా చేయలేదు. దానికి కారణం మహేష్ బాబుకు ముందు నుంచి ఒకరు చేసిన సినిమాలను కాపీ కొట్టే అలవాటు లేకపోవడమే . ఏదైనా సరే తనతో ఫ్రెష్ గా ఆ కథను తెరకెక్కించాలని అనుకుంటూ ఉంటారట మహేష్ బాబు .

ఇప్పటి వరకు చాలా రీమేక్ సినిమాల కోసం మహేష్ బాబు ని డైరెక్టర్ లు అప్రోచ్ అయ్యారట. కానీ ఎక్కడా కూడా మహేష్ బాబు దానికి ఇంట్రెస్ట్ చూపించలేదట . స్వతహాగా సొంత కంటెంట్ రాసుకొని వచ్చి సొంత కథతో వచ్చిన డైరెక్టర్స్ కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారట . ఎవరో ఆల్రెడీ రాసేసి తీసేసిన కథను మళ్ళీ మనం తెరపై జనాలకు ఏం చూపిస్తాం అనేది మహేష్ బాబు అభిప్రాయం . అందుకే తన 23 ఏళ్ల కెరీర్ లో 27 చిత్రాలో నటించాడు. 27 చిత్రాల్లో ఒక్కటంటే ఒక్క రీమేక్ సినిమా కూడా లేదు . త్వరలోనే మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ప్రజెంట్ గుంటూరు కారం సినిమా షూట్ లో బిజీ బిజీగా ఉన్నాడు మహేష్ బాబు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news