Moviesహ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్‌లో క‌ళ్యాణ్‌రామ్‌… డైరెక్ట‌ర్ ఎవ‌రంటే..!

హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్‌లో క‌ళ్యాణ్‌రామ్‌… డైరెక్ట‌ర్ ఎవ‌రంటే..!

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఆచితూచి కథలు ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తారు. అలా చేసే సినిమాలు కాస్త భిన్నంగా ఉండేలా చూసుకుంటారు. ఒక మూస పద్ధతిలో.. రొటీన్ రొడ్డ కొట్టుడు కథలతో సినిమాలు చేయటం కళ్యాణ్‌రామ్ కు అస్సలు ఇష్టం ఉండదు. క‌ళ్యాణ్‌రామ్ బింబిసారా లాంటి సినిమాతో పెద్ద హిట్ కొట్టారు. ఆ తర్వాత అమిగోస్‌ కాస్త తేడా కొట్టింది. అయితే అది కూడా కొత్తగా చేసిన ప్రయత్నం కావడం మెచ్చుకోవాల్సిన విషయం.

ప్రస్తుతం డెవిల్ సినిమా రెడీ అవుతోంది. డెవిల్ సినిమా పీరియాడిక్ బ్యాగ్రౌండ్ స్పై మూవీ. దీని తర్వాత కళ్యాణ్ రామ్ తర్వాత సినిమా ఏంటి ? అన్నది అనౌన్స్ చేయలేదు. ప్రస్తుతం బింబిసార సీక్వెల్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. ఈ లోగా ఓ హర్రర్ థ్రిల్లర్ చేసే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఓ దర్శకుడు చెప్పిన హర్రర్‌ థ్రిల్లర్ కథ‌ కాన్సెప్ట్ నచ్చి కళ్యాణ్ రామ్ దీనిని తన సొంత బ్యానర్లో నిర్మించడానికి.. తాను హీరోగా చేయటానికి ఓకే చెప్పాడని తెలుస్తుంది.

అయితే ఈ సినిమాపై ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు. సరైన టైంలో అనౌన్స్ చేసి సినిమా షూటింగ్ ప్రారంభించాలన్న ఆలోచనలో కల్యాణ్‌రామ్ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడే మరో వర్షన్ కూడా వినిపిస్తోంది. ఓ దర్శకుడు కథ చెప్పటం వరకు కరెక్టే కానీ.. కళ్యాణ్ రామ్ ఇంకొన్ని మార్పులు చేర్పులు చెప్పాడని అవి చేసిన వెంటనే ఈ సినిమా ఓ కొలిక్కి వస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం నందమూరి కళ్యాణ్ రామ్ అభిమానులు అందరూ డెవిల్ సినిమాతో ఈ నందమూరి హీరో సూపర్ హిట్ కొడతాడు అన్న అసలు అంచనాలతో ఉన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news