కలర్స్ స్వాతి తన భర్తకు దాదాపు దూరమైనట్టు తెలుస్తోంది. ఇటీవల సోషల్ మీడియా వేదికగా పలువురు సెలబ్రిటీలు విడాకుల ముందే కొన్ని సిగ్నల్స్ ఇస్తున్నారు. సమంత.. నిహారికతో పాటు చాలామంది సెలబ్రిటీలు విడాకులకు ముందు తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో పేరు మార్చేస్తున్నారు. ఇక నెలరోజుల క్రితం కలర్స్ స్వాతి కూడా ఇదే తరహా సిగ్నల్స్ ఇచ్చారు.
ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ నుంచి భర్త ఫోటోలు డిలీట్ చేయడంతో పెద్ద చర్చకు దారితీసింది. భర్తతో ఆమెకు విభేదాలు మొదలయ్యాయి అన్న సందేహాలు వినిపించాయి. గత ఏడది స్వాతి కం బ్యాక్ ప్రకటించారు. పంచతంత్ర టైటిల్ తో ఒక మూవీ చేసినా అది అనుకున్నంతగా ఆడలేదు. ప్రస్తుతం ఆమె తెలుగులో రెండు సినిమాలలో నటిస్తోంది. ఇక కలర్స్ స్వాతి 2018 లో ప్రేమావివాహం చేసుకుంది. ఆమె భర్త పేరు వికాస్ వాసు.
వాసు వృత్తిరిత్య పైలట్. వివాహం అనంతరం స్వాతి విదేశాలలో సెటిల్ అయ్యారు. ఆమెది మంచి కుటుంబం అని తెలుస్తోంది. స్వాతి ఇటీవల ఇండియాకు వచ్చినట్టు సమాచారం. కొన్నాళ్లుగా ఆమె తన భర్తతో ఉండకుండా ఇండియాలోనే ఉంటూ నటిగా వరుస సినిమాలు ప్రకటిస్తున్నారు. ఇక కలర్స్ పేరుతో ప్రసారమైన షో తో స్వాతి బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత కృష్ణవంశీ డేంజర్ సినిమాతో ఆమెను హీరోయిన్గా వెండితెరకు పరిచయం చేశారు. తెలుగు, తమిళ భాషలలో స్వాతి పలు సినిమాలలో నటించింది.
అయితే స్వాతి తన భర్తకు దూరం అవటం వెనక ఆమెదే తప్పు అన్న గుసగుసలు కూడా ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్నాయి. ఆమె చాలా స్పీడ్ అని.. దీనికి తోడు చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటుందని ఇవి భర్తకు నచ్చకపోవటం వల్లే ఆమె భర్తకు దూరమైందని తెలుస్తోంది. చిన్నచిన్న గొడవలు పెరిగి ఇద్దరి మధ్య మనస్పర్ధలకు కారణమై అవి చివరకు విడాకుల వరకు వెళ్లాయని సమాచారం. సేమ్ నిహారిక ఎంత స్వేచ్ఛగా ఉండాలనుకుని భర్తకు దూరమైందో స్వాతి కూడా అలాగే దూరమైందని టాక్ ?