Movies"తమన్నాను ప్రేమించా.. కానీ అలా చేయడం ఇష్టం లేదు"..విజయ్ వర్మ షాకింగ్...

“తమన్నాను ప్రేమించా.. కానీ అలా చేయడం ఇష్టం లేదు”..విజయ్ వర్మ షాకింగ్ కామెంట్స్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న తమన్నా ప్రెసెంట్ సినిమా ఇండస్ట్రీలో ఏ స్థానంలో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆమె రీసెంట్గా భోళా శంకర్ సినిమాలో నటించింది. ఈ సినిమా డిజాస్టర్ గా మారింది . అయినా సరే తమన్న పాపులారిటి క్రేజ్ ఎక్కడ తగ్గడం లేదు . రీసెంట్ గానే బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమాయణం కొనసాగిస్తున్నాను అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చింది తమన్నా.

లస్ట్ స్టోరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఈ విషయంపై ఇద్దరూ ఓపెన్ అప్ అయ్యారు . అప్పటినుంచి ఈ జంటపై స్పెషల్ ఫోకస్ ఏర్పడింది . ఈ క్రమంలోనే రీసెంట్గా విజయ్ వర్మ తన ప్రేయసి మిల్కీ బ్యూటీ తమన్న పై షాకింగ్ కామెంట్స్ చేశారు . “తమన్నాతో లవ్ రిలేషన్ బాగానే ఉందని ..కానీ ఆమెతో బయటకు వెళ్లాలంటేనే ఇబ్బందికరంగా ఉందని ..అందరి కళ్ళు మాపైనే పడ్డాయి అని.. మొదటినుంచి నా పర్సనల్ లైఫ్ అలా ఉండకూడదు అని డిసైడ్ అయ్యానని ..కానీ ఆఖరికి అలాగే అందరికీ తెలిసిపోతుందని చెప్పుకొచ్చాడు “.

“అంతేకాదు ఫ్యాన్స్ మనసుల్లో మా జంట పై ఇలాంటి స్దానం దక్కించుకుంటాం .. మేము కూడా అలా ఉన్నామన్న విషయం నాకు తెలిసి ఆశ్చర్యపోయాను.. ఫాన్స్ మమ్మల్ని ఇంతలా ఆరాధిస్తున్నారా..? అంటూ షాక్ అయ్యాను. దానికి ఆనందంగానే ఉన్న ప్రైవసీ మిస్ అయిపోతున్నాను అని బాధగా ఉంది . అందుకే ఆమెతో బయటకు వెళ్లడం నాకు ఇష్టం లేదు ” అంటూ సరదాగా ఫన్నీగా చెప్పుకొచ్చారు . దీంతో సోషల్ మీడియాలో ఇవే కామెంట్స్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news