విజయ్ దేవరకొండ – సమంత కలిసి నటించిన ఖుషి సినిమా సెప్టెంబర్ 1న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా ప్రమోషన్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా విజయ్ దేవరకొండకు చెందిన కొన్ని వ్యక్తిగత విషయాలను హీరోయిన్ సమంత బయట పెట్టింది. సినిమాల్లో కనిపించే విజయ్‌కు.. బయట అతడి వ్యక్తిత్వానికి చాలా తేడా ఉందని చెబుతోంది సమంత.
తొలిసారి విజయ్‌తో కలిసి నటించిన ఈ హీరోయిన్ రియల్ లైఫ్ లో అతడిని చూసి చాలా ఆశ్చర్యానికి గురైందట. విజయను అంత రెబెల్ అనుకుంటారు.. నేను కూడా అలానే అనుకునే దానిని.. అయితే సెట్స్‌లో అతడిని చూసిన తర్వాత అతడి గురించి తనకు పూర్తిగా అర్థమైందని చెబుతోంది. విజయ్ కు ఎలాంటి దురాలవాట్లు లేవు.. ప్రతిరోజు జిమ్ చేస్తాడు.. చాలా క్రమశిక్షణగా ఉంటాడు.. తన సినిమా గురించి మాత్రమే ఆలోచిస్తాడు.. ఒక్క చెడు అలవాటు కూడా లేదు.. పార్టీలకు వచ్చినప్పుడు కూడా విజయ్ డ్రింక్ చేయడంది.
ఇక పార్టీల్లో కూడా ఒక వైన్ గ్లాస్ మాత్రమే పట్టుకుంటాడు.. పార్టీలో ఎన్ని గంటలు గడిపిన ఆ వైన్ గ్లాస్ మాత్రం అలాగే ఉంటుందట. విజయ్ చాలా సాఫ్ట్ మనిషి అని చెబుతోంది సమంత. ఇక విజయ్ దేవరకొండ పెళ్లిపై కూడా రియాక్ట్ అయింది సమంత. తను రెండు మూడు ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటానని పైకి చెబుతున్నా.. ఈ యేడాదిలోనే అతడు పెళ్లి చేసుకుంటాడని తనకు అనిపిస్తుందని చెప్పింది. పక్కనే ఉన్న విజయ్ కూడా తన పెళ్లి అంశంపై రియాక్ట్ అయ్యాడు. కొన్ని ప్రాక్టికల్ కారణాలవల్ల తనకు పెళ్లి పై మంచి ఒపీనియన్ కలిగిందని చెబుతున్నాడు.