విజయ్ దేవరకొండ – సమంత జంటగా నటించిన ఖుషి సినిమా రేపు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది. లైగర్ లాంటి భారీ డిజాస్టర్ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ నటిస్తున్న ఈ సినిమాపై టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో మంచి అంచనాలు ఉన్నాయి. దీనికి తోడు సమంత హీరోయిన్గా నటిస్తుండడంతో పాటు ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్లు, ట్రైలర్లు, పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో ఖుషి సినిమాకు అటు ట్రేడ్ వర్గాలతో పాటు.. ఇటు సినీ అభిమానుల్లోనూ క్రేజ్ ఉంది.
ఈ సినిమా ప్రమోషన్లలో విజయ్ దేవరకొండ ఈ సినిమాతో పాటు తన వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తనతో పాటు నటించిన సమంతను ఆకాశానికి ఎత్తేస్తున్నాడు. ఇక జీవితంలో ఫెయిల్యూర్ చాలా ముఖ్యం.. ప్రతి ఒక్కరికి ఫెయిల్యూర్ అనేది ఏదో ఒక టైంలో తప్పకుండా ఎదురవుతుంది.. లైఫ్ లో నేను చాలా సక్సెస్ లతో పాటు ఫెయిల్యూర్స్ కూడా చూశాను.. వాటి గురించి బయట చాలా మంది మాట్లాడారని విజయ్ గుర్తు చేసుకున్నాడు.
నా దృష్టిలో ఫెయిల్యూర్ సక్సెస్ ఎప్పుడూ ఒకేలా చూడాలని.. చేసిన తప్పులు చేయకుండా అపజయాల నుంచి చాలా నేర్చుకోవాలని చెప్పాడు. ఇక తన ఫేవరెట్ ఫుడ్స్ చాలా ఉన్నాయని చెప్పిన విజయ్ హైదరాబాద్ బిర్యాని, దోశ, బర్గర్, చీజ్ కేక్ ఇష్టంగా తింటాను.. ఇవన్నీ తిన్నా వర్క్ అవుట్ బాగా చేస్తా అలా బరువు పెరగకుండా చూసుకుంటా.. నాకు ఆర్కిటెక్చర్ చాలా ఇష్టం… మా ఇంట్లో డెకరేషన్ ఎలా ? ఉండాలో నేనే సెలెక్ట్ చేశా.. ఫ్యూచర్ లో ఒక ఫామ్‌హౌస్ కొని దాన్ని నాకు నచ్చినట్లు డిజైన్ చేయించుకోవాలని అనుకుంటున్నట్టు విజయ్ చెప్పాడు.
ఇక తనకు బిజినెస్ ఆలోచనలు కూడా ఉన్నాయని… ట్రావెలింగ్ – స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం.. ఇటీవల మాల్దీవ్స్ వెళ్లాను.. ఖుషి టైంలో కాశ్మీర్ వెళ్లడంతో అది నా ఫేవరెట్ ప్లేస్ అయిపోయింది.. స్నేహితులతో కలిసి బాస్కెట్ బాల్ ఆడుతూ ఉంటా కొత్త విషయాలు నేర్చుకోవటం చాలా ఇష్టం అని విజయ్ తెలిపాడు.