ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ అందరూ వరుసగా పెళ్లిళ్లు చేసుకొని గుడ్ న్యూస్‌లను అభిమానులకి చేరవేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న హీరోస్ కి సంబంధించిన పెళ్లి వార్త వినాలని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కాగా ఆలిస్ట్ లోకే వస్తాడు టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ .
ఇండస్ట్రీకి వచ్చిన అది తక్కువ టైంలో స్టార్ గా మారిన విజయ్ పెళ్లి చేసుకుంటే చూడాలి అన్నది అభిమానుల కోరిక . అయితే రీసెంట్గా నటించిన ఖుషి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ..పెళ్ళి గడియలు దగ్గరకు వచ్చేసినట్లు ఉన్నాయని క్రేజీ హింట్ ఇచ్చాడు. రీసెంట్గా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలో మాట్లాడిన విజయ్ దేవరకొండకు పెళ్లిపై ప్రశ్న ఎదురైంది .
ఈ క్రమంలోనే విజయ్ అన్సర్ ఇస్తూ..” నేను అరెంజ్డ్ మ్యారేజ్ చేసుకోలేను అమ్మాయి గురించి నేను ముందు తెలుసుకోవాలి .. ఆమెతో కొంత సమయం గడపాలి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి మరి ముఖ్యంగా మా అమ్మగారికి ఆ అమ్మాయి బాగా నచ్చాలి .. వాళ్ళిద్దరి మధ్య హెల్తీ రిలేషన్షిప్ మైంటైన్ చేసుకున్న తర్వాతే నేను పెళ్లి చేసుకుంటా “అంటూ చెప్పుకొచ్చాడు . దీంతో రౌడీ హీరో కామెంట్స్ వైరల్ గా మారాయి..!!