టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ప్రిన్స్ గా పాపులారిటీ సంపాదించుకున్న వరుణ్ తేజ్ లేటెస్ట్ గా నటిస్తున్న సినిమా “గాండీవ దారి అర్జున”. ఆగస్టు 25వ తేదీ ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాక్షి వాద్య హీరోయిన్గా నటిస్తుంది . ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ – టీజర్ – ఫస్ట్ లుక్ – పాటలు ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో వరుణ్ తేజ్ సినిమా ప్రమోషన్స్ చురుగ్గా పాల్గొంటున్నారు . ఈ క్రమంలోనే రీసెంట్గా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వరుణ్ తేజ్ అన్న రామ్ చరణ్ ఇచ్చిన సలహా గురించి ఓపెన్ అప్ అయ్యారు .
ఆయన మాట్లాడుతూ ..”మంచి సినిమా ఇవ్వాలనే ప్రెజర్ జనాలను ఎంటర్టైన్ చేయాలని.. ప్రతి ఒక్క నటుడుకి యాక్టర్ కి ఉంటుంది . నా వరకు ఫ్యామిలీ ప్రెజర్ అనేది ఎక్కడా లేదు. ఒక యాక్టర్ గా ఎలాంటి సినిమాలు చేయాలి ..చేయొద్దు అనేది పూర్తిగా నా వ్యక్తిగతం.. ఆ విషయంలో నన్ను ఎవరు ఇబ్బంది పెట్టరు .. నేను కూడా ఇప్పటివరకు తీసిన సినిమాలలో అన్ని జనాలను ఎంటర్టైన్ చేశానని అనుకుంటూ వచ్చాను .. అయితే ఇదే సమయంలో నేను ఏడవ సినిమా చేస్తున్న క్రమంలో మా అన్నయ్య చరణ్ నన్ను పిలిచి ఒక మాట చెప్పాడు . నీకు నచ్చిన సినిమాలు చేస్తూ పో హిట్ – ఫ్లాప్స్ ఆలోచించొద్దు. ఒక నటుడిగా సెటిల్ అవ్వాలంటే ఇలాంటివి ఆలోచించకూడదు”.
“బిజినెస్ అనేది వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది . కానీ జనాల అభిమానం ఎప్పుడు స్థిరంగా ఉంటుంది . అందుకే జనాలను ఎంటర్టైన్ చేసే సినిమాలు చెయ్. పెద్ద ప్రొడ్యూసర్స్ ఏవేవో చెప్పి నీ రూల్స్ బ్రేక్ చేయాలని చూస్తారు..కొన్నిసార్లు పెద్దపెద్ద ప్రొడ్యూసర్స్ వచ్చి నిన్ను ఇబ్బంది పెడతారు .. నీ రిస్ట్రిక్టెడ్ జోన్ నుంచి బయటకు తీసుకొస్తారు. అలాంటి ట్రాప్ లో పడొద్దు . అది ఫ్యూచర్లో నీ కెరియర్ మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది . అత్యాశకు పోతే అసలకే మోసం వస్తుంది “అంటూ చరణ్ ఇచ్చిన సలహాలు ఓపెన్ గా చెప్పుకొచ్చాడు వరుణ్ తేజ్..!!