ఓ సినిమా రిలీజ్ కి ముందు ప్లాప్ అవుతుందని చాలామందికి తెలిసిపోతూ ఉంటుంది. అయితే ఆ విషయాన్ని బయటకు చెప్పరు. సినిమా విడుదల తర్వాత కూడా మౌనంగా ఉంటారు. అయితే ఇటీవల హీరోలు మారారు.. తాము నటించిన ఓ సినిమా బాగోలేకపోతే ఆ సినిమా ఫెయిల్ అయిందని.. ఆ సినిమా ప్లాప్ అవుతుందని తమకు ముందే తెలుసు అంటూ చెబుతున్నారు.
విజయ్ దేవరకొండ లైగర్ సినిమా విషయంలో ఇలాంటి ప్రకటనే చేశాడు. ఆ తర్వాత నాగచైతన్య కూడా తాను నటించినా థాంక్యూ సినిమా ప్లాప్ అవుతుందన్న విషయం తనకు ముందే తెలుసు అని ప్రకటించాడు. ఇప్పుడు ఈ లిస్టులోకి వరుణ్ తేజ్ కూడా చేరాడు. వరుణ్ తేజ్ గత ఏడాది గని సినిమా చేశాడు. అది అతిపెద్ద డిజాస్టర్ అయింది. చివరకు ఆ సినిమా చేసినందుకు బహిరంగంగా లేఖ విడుదల చేసి మరి ప్రేక్షకులకు క్షమాపణ చెప్పాడు.
గని సినిమా ప్లాప్ అవుతుందన్న విషయం తనకు ముందే తెలుసు అని.. అది స్పోర్ట్స్ జానర్ మూవీ.. దాన్ని అదే జనాల్లో తీస్తే బాగుండేది.. అందులో అన్ని జానర్లు మిక్స్ చేశారు.. అందుకే గని సినిమా దెబ్బ కొట్టిందని వారిని చెప్పాడు. మిస్టర్ సినిమా ప్లాప్ అయినప్పుడు ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను… గని సినిమా ప్లాప్ అయ్యా కూడా అన్నే పాఠాలు నేర్చుకున్నానని అంగీకరించాడు. అయితే ఇక్కడే వరుణ్ తేజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అల్లు అరవింద్ కొడుక్కి మంట పెట్టేలా ఉన్నాయన్న గుసగుసలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
గని సినిమాకు అల్లు అరవింద్ పెద్ద కొడుకు బాబి నిర్మాత. ఈ సినిమా రిలీజ్ కి ముందు బాబి చాలా అంచనాలు పెట్టుకున్నాడు. బాహుబలి రేంజ్ లో హిట్టు కొడతామన్నట్టుగా మాట్లాడాడు. కట్ చేస్తే పెద్ద డిజాస్టర్ అవడంతో పాటు బాబీకి భారీ నష్టం తెచ్చిపెట్టింది. దీనికి తోడు వరుణ్ తేజ్ ఈ సినిమా డిజాస్టర్ అయినప్పుడు బహిరంగంగా లేఖ విడుదల చేయటం.. ఇప్పుడు ఈ సినిమా ప్లాప్ అవుతుందని.. సరిగా తీయలేదని మాట్లాడటం కచ్చితంగా బాబీని ఇరుకుని పెట్టేలా ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. మరి దీనిపై బాబి నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుందో చూడాలి.