బుల్లితెరపై … సోషల్ మీడియాలో రష్మి గౌతమ్ అనే పేరుకు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రష్మీ అన్న పేరు వినపడగానే పక్కనే తోకగా మరో పేరు కూడా వినపడుతూ ఉంటుంది. అదే సుడిగాలి సుషీర్ రష్మి – సుడిగాలి సుధీర్ జంటకు ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోవర్స్ ఉన్నారు . ఒకప్పుడు నాగచైతన్య సమంత జంటకు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కిందో ఈ జంటకు అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కింది. వాళ్ళు రియల్ కపుల్స్.. అయితే వీళ్ళు రియల్ కపుల్స్..అంటూ అప్పట్లో తెగ ప్రచారం చేశారు .
అయితే రష్మీ సుధీర్ దూరం దూరంగా ఉన్నారు. సినిమా పనుల్లో సుధీర్ బిజీగా అయిపోతే రష్మి తన షోస్ లో తను బిజీ అయిపోయింది. రీసెంట్ గా శ్రీదేవి డ్రామా కంపెనీకి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్ . ఈ క్రమంలోనే ప్రతి వారం సరికొత్త స్కిట్స్ వేస్తూ ప్రేక్షకులను అలరించే శ్రీదేవి డ్రామా కంపెనీ కమెడియన్స్ మరోసారి అదే స్టైల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు . కాగా లేటెస్ట్ గా రిలీజ్ అయిన ప్రోమో ప్రకారం ఫ్రెండ్షిప్ డే నేపథ్యంలో మరింత ఎంటర్ టైనింగ్ గా యాంకర్ రష్మీ పెళ్లి చూపులను డిజైన్ చేశారు.
ఈ క్రమంలోనే పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళల్లో ఓ అబ్బాయ్ ని రష్మి అడుగుతూ ..”ఏంటి నేను నీకు నచ్చలేదా..?” అంటూ ప్రశ్నిస్తుంది. అయితే “ఆలోచించి చెప్తా మేడమ్” అంటాడు ఆ అబ్బాయి. “ఇంత అందగత్తెను నేను నచ్చలేదా..?” అంటూ రష్మీ హర్ట్ అవుతుంది . అయితే అప్పుడే పక్కన్న ఉన్న వర్ష మైక్ అందుకుని సుడిగాలి సుధీర్ తో ఫోన్లో మాట్లాడుతున్నట్లు .. “బావ నువ్వే ఆలోచించట్లేదు.. రష్మీ విషయంలో అందరూ ఆలోచిస్తున్నారు” అంటూ కూసింత ఘాటుగా కామెంట్ చేసింది.
అయితే రష్మిని నువ్వే తొందరపడి లవ్ చేసావని మిగతా వాళ్ళు ఆమె అసలు అందగత్తె కాదు ” అనేది ఆమె అభిప్రాయం . దీంతో షోలోనే రష్మీ హర్ట్ అయిన ఎక్స్ప్రెషన్స్ ప్రోమోలో క్లియర్గా తెలుస్తుంది . దీంతో శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమో వైరల్ గా మారింది . అయితే ఇదంతా స్కిట్లో భాగమే అయినప్పటికీ ప్రతిసారి రష్మీ సుధీర్ ల జంటను టార్గెట్ చేస్తూ ఉండడం ఏ మాత్రం బాగాలేదు అంటున్నారు జనాలు..!!