టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కం బ్యాక్ ఇచ్చినప్పటి నుంచి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. సైరా, ఆచార్య, గాడ్‌ఫాదర్ లాంటి వరుస ప్లాపులు పడ్డా కూడా ఈ సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలోనే తన విజయ పరంపర కంటిన్యూ చేసే క్రమంలో ఈ నెల 11న భోళాశంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
ఈ సినిమా పూర్తయిన వెంటనే చిరు నాగార్జున సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు సినిమాల ఫేం కురసాల కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను చిరు పెద్ద కుమార్తె కొణిదెల సుస్మిత స్వయంగా నిర్మిస్తున్నారు. మళయాళంలో సూపర్ హిట్ అయిన బ్రో డాడీని తెలుగులో రీమేక్ చేస్తున్నారు.
ఈ సినిమాలో చిరంజీవితో పాటు చిరు కుమారుడి పాత్ర కూడా కీలకం కానుంది. చిరుకు జోడీగా త్రిష నటిస్తోంది. సుమారు 16 సంవత్సరాల తర్వాత వీరిద్దరు కలిసి నటిస్తున్నారు. గతంలో వీరు స్టాలిన్ సినిమాలో నటించారు. ఇక సినిమాలో చిరు కొడుకు పాత్ర కోసం ముందుగా సిద్ధు జొన్నలగొడ్డను అనుకున్నారు. అయితే సిద్ధు ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో ఇప్పుడు మరో యంగ్ హీరోను ఈ క్రేజీ ప్రాజెక్టులోకి తీసుకువచ్చారు.
ఆ హీరో ఎవరో కాదు శర్వానంద్. ఉపాసన కామినేని, రామ్‌చరణ్‌కు అత్యంత సన్నిహితుడు అయిన శర్వాను ఉపాసనే స్వయంగా ఈ ప్రాజెక్టులోకి ఎంటర్ చేయించినట్టు తెలుస్తోంది. తన ఆడపడుచు నిర్మాత.. అటు మామ చిరు హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టు తెరకెక్కుతుండడంతో శర్వానంద్ ఉంటే ఆ క్రేజ్ వేరుగా ఉంటుందని ఉపాసన రంగంలోకి దిగి శర్వాను ఈ ప్రాజెక్టులోకి ఎంటర్ చేయించినట్టు సమాచారం. ఏదేమైనా ఈ కాంబినేషన్ అయితే అదిరిపోయిందనే చెప్పాలి.