Moviesమెగా కోడలా మజాకా.. బన్నీకి అలాంటి గిఫ్ట్ పంపిన ఉపాసన.. ఎక్కడ...

మెగా కోడలా మజాకా.. బన్నీకి అలాంటి గిఫ్ట్ పంపిన ఉపాసన.. ఎక్కడ కొట్టాలో అక్కడే కొట్టిందిగా..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే అల్లు అర్జున్ పేరే మారుమ్రోగిపోతుంది . దానికి కారణం రీసెంట్గా ఆయనకు ఉత్తమ నటుడుగా జాతీయ అవార్డు వరించడమే. 69వ జాతీయ అవార్డుల విన్నింగ్ లిస్టులో బన్నీ టాప్ పొజిషన్ లో ఉన్నాడు . ఉత్తమ నటుడిగా ఆయనని జాతీయ అవార్డు వరించింది . 69 ఏళ్లగా టాలీవుడ్ జనాలు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూసిన మూమెంట్ ని తీసుకొచ్చాడు బన్ని.

ఈ క్రమంలోనే ఆయనకు సోషల్ మీడియా వేదికగా పలువురు ఫ్యాన్స్ శ్రేయోభిలాషుల కుటుంబ సభ్యులు విషెస్ అందజేస్తున్నారు . ఈ క్రమంలోనే రామ్ చరణ్ సతీమణి ఉపాసన బన్నీకు స్పెషల్ గిఫ్ట్ను పంపించి మరీ విష్ చేసింది. రకరకాల పూలు ఉన్న ఫ్లవర్ బొకేను బన్నీ ఇంటికి పంపిస్తూ ..”డియర్ బన్నీ.. నువ్వు ఇంతటి ఘన విజయం సాధించినందుకు చాలా గర్వంగా ఉంది ..నువ్వు అందుకు అర్హుడువి.. కంగ్రాట్యులేషన్స్” అంటూ నోట్ రాసుకొచ్చింది.

దీనికి బన్నీ సైతం ఉపాసనకు రిప్లై ఇచ్చాడు ..”థాంక్యూ సో మచ్ “అంటూ రిప్లై ఇచ్చాడు . ప్రెసెంట్ ఇదే కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. కాగా గత కొన్ని రోజులుగా రాంచరణ్ – అల్లు అర్జున్ మధ్య గొడవలు జరుగుతున్నాయి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. వాటికి చెక్ పెడుతూ ఉపాసన ఘాతుగా బదిలిచ్చిన్నట్లైంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news