టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఉన్న స్పెషల్ క్రేజ్ .. ఫ్యాన్ ఫాలోయింగ్.. మిగతా ఏ హీరోకి లేదనే చెప్పాలి . చిన్నవాళ్ళు ఆయనను చూస్తే ఆయనలా మారాలి అనుకుంటారు . పెద్దవాళ్ళు మేమెందుకు తారక్ లా ఉండలేకపోతున్నాం అంటూ బాధపడతారు . అంతటి మంచి క్వాలిటీస్ కలిగిన ఈ హీరో మన ఇండస్ట్రీలో ఉండడం నిజంగా తెలుగు ఇండస్ట్రీకి గర్వకారణం అని చెప్పాలి. ఇప్పటికే ఎంతోమంది స్టార్ సెలబ్రిటీస్ ఎన్టీఆర్ లోని మంచితనాన్ని గొప్పతనాన్ని బయటకు చెప్పారు .
రీసెంట్ గా మరో ఆర్టిస్ట్ ఎన్టీఆర్ గొప్పతనాన్ని వివరించారు. రీసెంట్గా ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రభాస్ శ్రీను తాజాగా ఎన్టీఆర్ పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ” యమదొంగ షూటింగ్ షూటింగ్ టైంలో నా భార్యకు అబార్షన్ జరిగింది ..చాలా బాధపడ్డాం. ఆ టైంలో నాకు ఇండస్ట్రీలో పెద్దగా గుర్తింపు లేదు ..చేతిలో డబ్బులు కూడా లేవు ..పలకరించే దిక్కు కూడా లేదు.. అయితే అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ నాకు ఫోన్ చేసి “నువ్వేం టెన్షన్ పడకు నెక్స్ట్ టైం నీకు నాలాంటి కొడుకు పుడతాడు ” అంటూ ధైర్యం చెప్పాడు”.
అంతేకాదు “ఏదైనా డబ్బులు అవసరమైతే మొహమాట పడకుండా అడుగు ..నేను నీ ఫ్రెండ్” అంటూ నాకు చెప్పుకొచ్చాడు . “ఆ టైంలో నాకు అనిపించింది ఇండస్ట్రీలో ఇలాంటి మంచి హీరోలు కూడా ఉంటారా ..?” అని .. ఎన్టీఆర్ గొప్పతనం గురించి అందరూ చెప్తుంటే విన్నాను .. ఫస్ట్ టైం చూసాను అంటూ చెప్పుకొచ్చారు . అంతేకాదు ఆయనతో వర్క్ చేస్తే చాలా సరదాగా ఉంటుందని .. తారక్ తో వర్క్ చేసిన వాళ్లకు మాత్రమే ఆ ఎంజాయ్మెంట్ ఉంటుందని చెప్పుకొచ్చాడు. అంతే కాదు ఎన్టీఆర్ చాలా బాగా కూడా వండుతాడని ..చాలా చాలా వెరైటీస్ కూడా వచ్చు అని చెప్పుకొచ్చాడు . ఇలా ప్రభాస్ శ్రీను చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి..!!