మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న సినిమాలు వరుసగా ప్లాపులు అవుతున్నా కంటిన్యూగా సినిమాలు చేయటం మాత్రం ఆపడం లేదు. తాజాగా రవితేజ నుంచి వస్తున్న సినిమా టైగర్ నాగేశ్వరరావు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 20న రిలీజ్ అవుతుంది. ఇప్పటికే టీజర్ విడుదల అయింది.. దీంతో సినిమాకు కాస్త హైప్ పెరగడంతో మార్కెటింగ్ ఈజీ అవుతుంది. ఈ క్రమంలోనే ఆంధ్ర ఏరియాను మొత్తం సింగిల్ పాయింట్ లో అమ్మేశారు.
పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన టాప్ డిస్ట్రిబ్యూటర్ ఉషా పిక్చర్స్ అధినేత ఉషా బాలకృష్ణ ఆంధ్ర ఏరియా హక్కులను రు. 18 కోట్లకు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఆయన ప్రాంతాలవారీగా కిందకు అమ్ముకుంటారు. ఇక నైజాం ఏరియాను ఎప్పటిలాగానే ఆసియన్ సినిమా సునీల్తో కలిసి ఓన్ రిలీస్ చేసుకుంటున్నారు. ఇంకా సీడెడ్, ఓవర్సీస్ బిజినెస్ కూడా క్లోజ్ చేయాల్సి ఉంది.
ఓవర్సీస్ రైట్స్ కాస్త ఎక్కువ రేటుకే కోట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఓవర్సీస్ లో నాలుగు కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారు. అందుకే బయ్యర్లు కాస్త ముందు వెనుక ఆడుతున్నట్టు తెలుస్తోంది. రవితేజకు ఓవర్సీస్లో ఆ రేంజ్ లో కలెక్షన్లు రావడం లేదు. సీడెడ్ కూడా రెండు మూడు రోజుల్లో బిజినెస్ క్లోజ్ అవుతుందని తెలుస్తోంది. టైగర్ నాగేశ్వరరావు మంచి పోటీలో రిలీజ్ అవుతుంది.
అటు భారీ అంచనాలతో బాలయ్య భగవంత్ కేసరి ఇటు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ లోకేష్ కనగరాజు లియో సినిమాలు బరిలో ఉన్నాయి. ఈ రెండిటిని తట్టుకోగల దమ్ము టైగర్ సినిమాలో ఉంటేనే అందరూ సేఫ్ అవుతారు. ముఖ్యంగా టీజర్ వచ్చాక కాస్త అంచనాలు ఉన్నాయి. అయితే అటు బాలయ్య – విజయ్ సినిమాలను కూడా ఏమాత్రం తక్కువ అంచనా వేయటానికి వీల్లేదు. ఈ రెండు సినిమాలు కూడా భారీ హై్‌తోనే వస్తున్నాయి. అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ సినిమాకు వంశీ దర్శకుడు.