టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు ప్రసెంట్ ఎంతో ఇష్టంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా గుంటూరు కారం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేద్దామా ..? వద్దా..? అన్నంత విధంగా నత్తనడకగా సాగుతుంది . ఈ సినిమా షూట్ కంప్లీట్ అయితే దర్శకధీరుడు రాజమౌళి సినిమా షూట్ ని సెట్స్ పైకి తీసుకురావాలనేది మహేష్ బాబు ఆలోచన. అది ఎప్పుడు జరుగుతుందో ఆ దేవుడికే తెలియాలి .
అయితే ఇప్పుడు రీసెంట్గా సోషల్ మీడియాలో మహేష్ కి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారింది . ఎటువంటి సీన్స్ అయినా సరే చిటెకలో చాలా ఈజీగా సునయాసంగా నటించే మహేష్ బాబు ఓ సినిమాలో ఓ సీన్ చేయడం కోసం ఏకంగా రెండు గంటలు సమయం తీసుకున్నారట. అంతేకాదు కెరియర్ లోనే అత్యధికంగా ఎక్కువ టేక్స్ తీసుకున్న సీన్ కూడా అదే కావడం గమనార్హం . ఆ సినిమా మరేదో కాదు ” భరత్ అనే నేను ” . కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మహేష్ బాబు కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది.
ఈ సినిమాలో భరత్ పాత్రలో కనిపించి మెప్పించాడు మహేష్ . అంతేకాదు ఈ సినిమాలో మనం మహేష్ బాబును సీఎంగా చూస్తాం . కాగా ఈ క్రమంలోనే భరత్ అనే నేను అని సీఎంగా ప్రతిజ్ఞ చేస్తున్న సమయంలో ఆ భరత్ అనే నేను డైలాగ్ చెప్పడానికి ఏకంగా రెండు గంటలు సమయం తీసుకున్నారట మహేష్ బాబు. దానికి మెయిన్ రీజన్ ఓ పొలిటీషియన్ బేస్ వాయిస్ లో ఎలా చెప్తాడో అదే విధంగా అదే మోడ్యూలేషన్ లో చెప్పడానికి కొరటాల శివ నానా తిప్పలు పెట్టారట . ఈ సీన్ కోసం ఏకంగా రెండు గంటలు ఆయన టైం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు ఆయన కెరీర్ లోనే ఎక్కువ టేక్స్ తీసుకున్న సీన్ గా ఈ సినిమా రికార్డ్ క్రియేట్ చేసింది . ఏది ఏమైనా సరే సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అదే చాలు అంటున్నారు ఫ్యాన్స్..!!