ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ..సోషల్ మీడియాలో.. వెబ్ మీడియాలో మెగా మనవరాలు “క్లీం కారా” పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . రామ్ చరణ్ ఉపాసనలకు పెళ్ళి అయిన 11 ఏళ్లకు జన్మించిన ఈ పాప మెగా ఫ్యామిలీకి ఎన్నో శుభసూచికలు ముందుగానే ఇచ్చేసింది . అంతేకాదు ప్రెసెంట్ “క్లీం కారా” రాకతో మెగా ఫ్యామిలీలో ఫుల్ సందడి వాతావరణం నెలకొంది . కాగా ఇన్నాళ్లు మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఉన్న ఉపాసన ఫస్ట్ టైం తన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది.
రీసెంట్గా ఉపాసన కూతురు క్లింకారా తో కలిసి ఫస్ట్ టైం బిడ్డ పుట్టిన తర్వాత తన పుట్టింటికి వెళ్ళింది . ఈ క్రమంలోనే ఉపాసన తల్లి శోభన మనవరాలు రాక కోసం గ్రాండ్గా ఏర్పాట్లు చేసి మరి ధూమ్ ధామ్ రేంజ్ లో సెలబ్రేట్ చేసింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు క్లీం కారా ఇంట్లోకి వచ్చే ముందు దిష్టి తీసిన పని వాళ్లకు ఏకంగా ఆమె 10 లక్షల రూపాయలను దిష్టి తీసినందుకు ఇచ్చిందట .
ఎవరైనా సరే.. ఎంత డబ్బు ఉన్నా సరే దిష్టి తీసిన వాళ్లకి 2000 మహా అయితే పదివేలు ఇలా చేతుల్లో పెడుతూ ఉంటారు. కానీ ఉపాసన తల్లి మాత్రం తన మనవరాలికి ఎటువంటి దిష్టి తగలకుండా ఉండేందుకు దిష్టి తీసిన వాళ్ళకి ఏకంగా 10 లక్షలు చేతుల్లో పెట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది . అంతే కాదు దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది . మెగా మనవరాలు రేంజ్ అదే అంటూ కామెంట్స్ చేస్తున్నారు మెగా అభిమానులు. మొత్తానికి క్లింకార నాన్న- తాతల కు మించిన స్టార్ సెలబ్రిటీ అయిపోయింది..!!