మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు గా టాలీవుడ్ లో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్… తన కెరీర్ మొదట్లో కాస్త ఇబ్బంది పడిన ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ విజయాలతో తిరుగులేని స్టార్ డమ్‌ను అందుకున్నారు. అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా ఎదిగాడు. పవర్ స్టార్ గా యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నాడు.. అన్న చిరంజీవిని మించిన తమ్ముడుగా ఎదగాడు. గతంలో ఓ ఇంట్రెస్టింగ్ విషయం అయితే ఈ అన్నదమ్ముల మధ్య చోటుచేసుకుంది.
పవన్ కెరీర్ మొదటిలో కథల ఎంపికలో చిరంజీవి ఎన్నో సూచనలు, సలహాలు ఇచ్చేవాడు.. వాటితోనే పవన్ కళ్యాణ్ కథలను ఎంపిక చేసుకుంటూ ముందుకు వచ్చేవారు.. అదే సమయంలో ఓ రోజు పవన్ కళ్యాణ్ దగ్గరకు ఒక కథ రాగా.. స్టోరీలో ఏవో లోపాలు ఉన్నాయని ఆయన సున్నితంగా ఆ కథను రిజెక్ట్ చేశాడు. తర్వాత అదే స్టోరీ చిరంజీవి వద్దకు వెళ్లగా.. అయకు బాగా నచ్చడంతో సినిమా చేశాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది.
ఇంతకీ ఆ సినిమా మారేదో కాదు బావగారు బాగున్నారా..? జయంత్ సి. పరాంజీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చిరంజీవికి జంటగా రంభ, రచనా హీరోయిన్లుగా నటించారు. చిరు సోంత బ్యానర్ అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఆయన తమ్ముడు నాగబాబు ఈ సినిమా నిర్మించారు. మణిశర్మ మ్యూజిక్ ఈ సినిమాకు ఎంతో హైలెట్ అయింది. 1998లో విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఆ రోజుల్లోనే 86 కేంద్రాల్లో 50 రోజులు, 54 కేంద్రాల్లో 100 రోజులకు పైగా ఆడింది.
అలాగే ఈ సినిమాలో ప్రతిపాట ఎంతో హిట్ అయింది. అయితే నిజానికి ఈ సినిమా పవన్ కళ్యాణ్ చేయాల్సిందట.. మొదట దర్శకుడు జయంత్ పవన్ కళ్యాణ్ కే కథ చెప్పాడట.. కానీ ఆయన నో చెప్పడంతో చిరంజీవి వద్దకు వెళ్ళగా స్టోరీ విన్న వెంటనే సినిమా ఓకే చేశాడు. అలా పవన్ కళ్యాణ్ వదులుకున్న కథతో చిరంజీవి నటించి మంచి విజయం అందుకున్నాడు.. అలాగే నిర్మాతగా నాగబాబు కూడా మంచి లాభాలు పొందాడు.