టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అలాంటి పవన్ కళ్యాణ్ కు కెరీర్ మొదట్లో తొలి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన సినిమా తొలిప్రేమ. ఇప్పటికీ ఈ సినిమా యూత్ లో ఎంతో మందికి ఫేవరెట్ సినిమా.. ఎస్.ఎస్.సి. ఆర్ట్స్ బ్యానర్ పై జి.వి.జి.రాజు నిర్మించిన ఈ సినిమాకి ఏ కరుణాకరన్ దర్శకత్వం వహించారు.
దర్శకుడిగా ఇదే మొదటి సినిమా. ఇందులో పవన్ కళ్యాణ్ కు జోడిగా నిజామాబాద్ లోకసభ నియోజకవర్గం మాజీ ఎంపీ గడ్డం గంగారెడ్డి మనవరాలు కీర్తి రెడ్డి హీరోయిన్‌గా నటించింది. వాసుకి, ఆలీ, వేణుమాధవ్, నగేష్, సంగీత వంటి వారు కీలకపాత్రలో నటించారుు. 1998లో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా ఎవరు ఊహించని ఘనవిజయం సాధించింది. మరీ ముఖ్యంగా యూత్ ను ఈ సినిమా ఎంతగానో ఆకట్టుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.
పవన్ కళ్యాణ్ నటన కీర్తి రెడ్డి గ్లామర్ సినిమాకు ఎంతగానో హైలెట్గా నిలిచింది. అంతేకాకుండా ఈ సినిమాలోని ప్రతిపాట ఇప్పటికే ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టమైన పాటల్లో ఈ సినిమా పాటలు కూడా ఒకటి. అంతే కాకుండా తొలిప్రేమ సినిమా పవన్ కళ్యాణ్‌ను స్టార్ హీరోగా నిలబెట్టడమే కాకుండా తెలుగులో క్లాసిక్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది. రీసెంట్ గానే 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తొలిప్రేమ సినిమాను 4కె వెర్షన్లో మళ్ళీ విడుదల చేశారు.
ఇక రీ రిలీజ్ లోను ఈ సినిమా ఎన్నో రికార్డులను క్రియేట్ చేసీ భారీ కలెక్షన్లు కూడా అందుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక్కడ చాలామందికి తెలియని మరో విషయం ఏమిటంటే.. తొలిప్రేమ సినిమాకు మొదటి ఛాయిస్ పవన్ కళ్యాణ్ కాదట. పవన్ కళ్యాణ్ కంటే ముందే ఈ సినిమాను ఓ అక్కినేని హీరో చేతులారా వదులుకున్నాడు. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు అక్కినేని నాగేశ్వరరావు మానవడు నాగార్జున మేనల్లుడు సుమంత్.. అవును మీరు వింటున్నది నిజమే.
డైరెక్టర్ కరుణాకరన్ తొలిప్రేమ సినిమా కథను ముందుగా సుమంత్ కే చెప్పారట. అయితే ఆ సమయానికి సుమంత్ హీరోగా ఎంట్రీ ఇవ్వలేదు. డెబ్యూ మూవీ కోసం సిద్ధమవుతున్నాడు. అ సమయంలోనే తొలిప్రేమ కథ సుమంత్ దగ్గరకు వచ్చింది. అయితే కథ నచ్చినప్పటికీ డైరెక్టర్ కు మొదటి సినిమా.. అతని పనితనంపై ఎలాంటి అవగాహన లేదు అనే కారణంతో సుమంత్ ఈ సినిమాకు నో చెప్పాడట.. అలా సుమంత్ నుంచి చేజారిన తొలిప్రేమ సినిమా.. పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్లి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచి టాలీవుడ్ కే స్టార్ హీరోగా మార్చింది.