టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత క్రేజ్ రోజు రోజుకి ఏ రేంజ్ లో పెరిగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా నాగచైతన్యతో విడాకులు తీసుకున్నప్పటినుంచి సమంత ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత స్థాయిలో పెరిగిపోతుంది . అయితే ఆమెను తిట్టే వాళ్ళ లిస్ట్ కూడా అంతే సరవేగంగా పెరుగుతూ వస్తుంది . కాగా రీసెంట్ గానే సమంత అమెరికా వెళ్ళిన సంగతి అందరికీ తెలిసిందే .
మయోసైటీస్ వ్యాధికి చికిత్స తీసుకోవడానికి శ్యామ్ అమెరికా వెళ్ళింది. అయితే ఈ క్రమంలోనే ఏటా భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలను న్యూయార్క్ లో అట్టహాసంగా నిర్వహిస్తూ ఉంటారు . ఈసారి ఈ ఏడాదికి ఆ వేడుకలో సమంత కూడా పాల్గొనింది. సమంతకు ఇండియా పరేడ్ నిర్వాహకుల నుంచి స్పెషల్ ఇన్విటేషన్ వచ్చింది. రీసెంట్ గానే అమెరికా వెళ్లిన ఆమె అక్కడ హంగామా చేసింది.
కాగా ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఇండియా పరేడ్ వేడుకల్లో ఆధ్యాత్మిక గురు శ్రీ రవిశంకర్ , బాలీవుడ్ నటి జాక్వెలిన్ ల తో కలిసి సమంత సందడి చేసింది సమంత. కాగా ఇదే క్రమంలో ఆమె వేసుకున్న డ్రస్ చాలా ఆకర్షణీయంగా ఉంది . రాయల్ లుక్ లో మెరిసిపోతూ .. అల్ట్రా స్టైలిష్ గా కూడా కనిపించింది. దీంతో సమంత ధరించిన డ్రెస్ పై అమ్మాయిల కన్ను పడింది. అయితే ఈ డ్రెస్ రీతు కుమార్ డిజైన్ చేసినట్లు తెలుస్తుంది. ట్రెండీ అండ్ ట్రెడిషనల్ కలగలిసేలా ఆమె డ్రెస్సును డిజైన్ చేసింది . అద్భుతమైన ఎంబ్రాయిడరీ వర్క్ తో ప్యాంట్ మరియు జాకెట్ సెట్ లో సమంత చాల హుందాగా కనిపించింది. ఈ డ్రెస్ ఖరీదు దాదాపు 3 లక్షలు పైగానే ఉంటుంది అంటూ సమాచారం అందుతుంది . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ గా మారింది.