దర్శకుల కారణంగా.. నష్టపోవడం ఏంటి? అనుకుంటున్నారా? క్యాస్టింగ్ కౌ…చ్ అనేది ఒకటి ఉందనేది అందరికీ తెలిసిందే. అయితే.. ఇప్పుడు ఇది బహిర్గతం.. ఒకప్పుడు మాత్రం అంతర్గతంగానే ఉండేది. ఈ విషయాన్ని బయటకు చెబితే.. ఛాన్స్‌లు మిస్సే. ముఖ్యంగా ఈ సమస్య తమిళ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఎక్కువగా ఉండేదంటే ఆశ్చర్యం వేస్తుంది. అందుకే.. చాలా మంది హీరోలు.. హీరోయిన్లు.. తమ ఇంటి ఆడపిల్లలను తెరమీదకు తీసుకురాలేదు.
చాలా మంది హీరోయిన్లు.. ఇబ్బందులు పడ్డారంటే ఆశ్చర్యం వేస్తుంది. ఈ పరంపరంలో జయసుధ, జయప్రద, సరిత, దివ్యవభారతి వంటివారు కూడా ఉన్నారంటే.. నివ్వెరపోతారు. ఒక సందర్భంలో ఓ అగ్రతార మాట్లాడుతూ.. ఫలానా దర్శకుడికి నా వర్జినిటీని పెట్టుబడి పెట్టాను.. అని చెప్పుకొన్నారు. ఆ తర్వాత.. ఆ దర్శకుడితో ఆమె వరుస సినిమాలు చేయడం గమనార్హం.
అంతేకాదు.. మరో దర్శకుడు కూడా ఈ హీరోయిన్ తో ఎఫై…ర్ పెట్టుకుంటే తప్ప అవకాశం ఇవ్వలేదు. ఈ
ఒక్క హీరోయినే కాదు.. క్యారెక్టర్ ఆర్టిస్టులపై కూడా.. దర్శకులు ప్రభావం, ఒత్తిడి ఎక్కువగా ఉండేది. తెలుగు ఇండస్ట్రీలోనూ అంతే. సిల్క్‌స్మిత ఆర్థికంగా, శారీరకంగా నష్టపోవడానికి ఓ నిర్మాత అంటారు కానీ.. దీనికి ముందు ఓ అగ్ర దర్శకుడు ఆమెను వాడుకుని వదిలేశారనే టాక్ ఉంది.
అలాగే దివంగత హీరోయిన్ దివ్యభారతి విషయంలోనూ తెలుగు ఇండస్ట్రీలో ఓ అగ్ర దర్శకుడిపై విమర్శలు వచ్చాయి. ఆమె అతడి విషయంలో కన్సీవ్ అయ్యిందనే వార్తలు కూడా రావడం గమనార్హం. సో.. మొత్తానికి ఇండస్ట్రీలో కొన్ని నెలల పాటు ఈ విషయం చర్చకు వచ్చింది. ఏదేమైనా హీరోయిన్లను.. హీరోలు ఎలా వాడతారన్న రూమర్లు ఉన్నాయో.. దర్శకులు కూడా అంతే వాడేస్తారనే పేరుంది.