సింగిల్ లాంగ్వేజ్ భారీ బడ్జెట్ సినిమా గా సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం రికార్డు క్రియేట్ చేయబోతుందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా ఖర్చు మాత్రమే కాదు రాబడి కూడా రికార్డ్ స్థాయిలో రాకపోతే సినిమాకు రిలీజ్ కి ముందే నష్టాలు తప్పేలా లేవు. ఈ సినిమా మీద చాలా నెంబర్లు వినిపిస్తున్నాయి. దాదాపు 225 కోట్లకు పైగానే ఖర్చు అవుతుందని తెలుస్తోంది. సినిమాకు అందరి రెమ్యూనరేషన్లు కలిపి 125 కోట్లు దాటేసాయని అంటున్నారు.
మరో 100 కోట్ల వరకు నిర్మాణం, వడ్డీలు, ప్రింట్.. పబ్లిసిటీ ఉంటుందని లెక్కలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఏడాదికాలంగా ఈ సినిమా చర్చల్లో నానుతోంది. సినిమాకు పని చేసిన ఇద్దరు ముగ్గురు టెక్నీషియన్లతో పాటు హీరోయిన్ కూడా మారిపోయారు. ఇక ఒక షెడ్యూల్లో చాలా సన్నివేశాలు అనుకున్నట్టుగా రాకపోవడంతో రీషూట్ చేశారట. దీంతో అదంతా వేస్ట్ అయింది. పాన్ ఇండియా సినిమాలు పక్కన పెడితే సింగిల్ లాంగ్వేజ్ సినిమాకు ఇంత పెద్ద బడ్జెట్ అంటే మామూలు విషయం కాదు.
థియేటర్ నుంచి రు. 125 కోట్ల ఆదాయం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే మహేష్ సర్కారు వారి పాటకు 80 కోట్లకు నుంచి వసూళ్లు రావట్లేదు. ఈ లెక్కన ఈ సినిమా మీద 125 కోట్ల థియేటర్ ఆదాయం అంటే చాలా ఎక్కువ. ఆడియో మీద 20 కోట్లు ఆశిస్తున్నారు… ఇది కూడా చాలా ఎక్కువ. ఇక నెట్‌ఫ్లిక్స్ నుంచి 80 కోట్లు వస్తుందని లెక్కలు వేసుకుంటున్న అది కూడా జరిగే పరిస్థితి లేదు.
ఏది ఏమైనా త్రివిక్రమ్‌కు సరైన ప్లానింగ్ లేకపోవటం.. ఇటు మహేష్ కూడా ముందు నుంచి ఈ సినిమా విషయంలో అంత ఆసక్తితో లేకపోవడం.. దీనికి తోడు మహేష్ ఇంట్లో జరిగిన సంఘటనలు ఇవన్నీ కలిసి ఈ సినిమా బడ్జెట్ విపరీతంగా పెరిగిపోవడానికి కారణమయ్యాయి. సినిమా అంచనాలకు మించి పాన్ ఇండియా రేంజ్ లో సంచలన విజయం సాధిస్తే తప్ప ఈ సినిమాకు లాభాలు వచ్చే అవకాశాలు కనపడటం లేదు. ఇక రిలీజ్ కి ముందు కూడా డెఫిసెట్లో రిలీజ్ అయ్యే ఛాన్సులు కూడా ఉన్నాయని టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.