సినిమా ఇండస్ట్రీలో సీనియర్ – జూనియర్ మధ్య అంతరం ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అలాంటిది ఓ సీనియర్.. జూనియర్ కలిసి నటించాల్సి వచ్చినప్పుడు సహజంగానే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అందులోనూ హీరోయిన్ సీనియర్ అయి.. హీరో జూనియర్ అయితే హీరో పరిస్థితి మామూలుగా ఉండదు. తాను కూడా అనుష్కతో అలాంటి ఇబ్బంది పడ్డానని అంటున్నాడు కుర్ర హీరో నవీన్ పోలిశెట్టి.
అనుష్క – నవీన్ పోలిశెట్టి జంటగా నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా వచ్చే నెలలో ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్లు ప్రారంభమయ్యాయి. అనుష్కతో సినిమా అనగానే తాను ఎంతో ఎక్సైట్ అయ్యానని.. అయితే ఆమెతో పరిచయం పెంచుకునేందుకు అంతలా కష్టపడ్డానని తెలిపాడు. తనకు తెలిసిన పద్ధతిలోనే అనుష్కకు దగ్గరయ్యానంటూ ఆ టెక్నిక్ కూడా చెప్పాడు.
అనుష్క దగ్గర సీరియస్ గా ఉండాల్సి వస్తుందేమో అని భయపడ్డానని.. ముందు రెండు రోజులు కొన్ని జోకులు ట్రై చేశాను.. 3 – 4 జోకులు బాగానే పేలాయి దాంతో అలా సెట్ అయిపోయింది.. ఇద్దరం క్లోజ్ అయిపోయాం.. ఆ క్లోజ్ సినిమాకు బాగా పనిచేస్తుంది.. సినిమా అంతా మా ఇద్దరి పాత్రల మీదే రన్ అవుతుంది.. మేం ఆ కెమిస్ట్రీ చూపించకపోతే కష్టం.. ఈ విషయంలో అనుష్కకి క్రెడిట్ ఇవ్వాలి అంటూ నవీన్ చెప్పాడు.
ఇక తన మార్కు జోకులతో అనుష్కకు దగ్గరైన విషయాన్ని కూడా నవీన్ బయట పెట్టాడు. అనుష్కతో నేను కలిసిన నటించిన సీన్లు తెరపై చూడాలని బాగా కోరికగా ఉంది.. నాకే ఇంతలా అనిపిస్తోంది అంటే ఆడియన్స్ కు ఇంకా ఎంత ఉత్సుకతగా ఉంటుందో అన్న విషయం నాకు తెలుసు.. అదే మా సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాడు. ఇక యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 7న థియేటర్లలోకి వస్తోంది.