టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న రాంచరణ్ ప్రజెంట్ ఎలాంటి క్రేజీ స్థానాన్ని అందుకున్నాడో మనకు బాగా తెలిసిన విషయమే. రీసెంట్గా ఆయన నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఏకంగా ఆస్కార్ అవార్డు అందుకుంది . ఈ క్రమంలోనే రామ్ చరణ్ పేరు గ్లోబల్ స్దాయిలో మారుమ్రోగిపోతుంది. అంతేకాదు ఆస్కార్ అవార్డు అందుకునే సమయంలొ రాంచరణ్ భార్య ఉపాసన గర్భవతి ఆరు నెలల కడుపుతో ఆస్కార్ ఈవెంట్లో మెరిసింది .
అయితే రీసెంట్ గానే ఉపాసన పండు లాంటి పాపకు జన్మనిచ్చింది . ఈ విషయం హాలీవుడ్ మీడియాలో సైతం వైరల్ గా మారింది. కాగా రీసెంట్గా వీళ్ళకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. రామ్ చరణ్ ఉపాసనలది లవ్ మ్యారేజ్ అన్న సంగతి అందరికీ తెలిసిందే . ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ . అయితే ఉపాసనను ఇంటికి కోడలుగా యాక్సెప్ట్ చేయడానికి రామ్ చరణ్ అమ్మగారు సురేఖ ఒక క్రేజీ కండిషన్ పెట్టిందట.
అంతేకాదు ఈ కండిషన్ వింటే ఎవరికైనా నవ్వులు రాక తప్పదు . మొదటినుంచి రామ్ చరణ్ మంచి ఫుడి . కడుపునిండా తినేస్తాడట. అంతేకాదు చాలా బద్ధకస్తుడు ..తిన్న ప్లేట్ కూడా పక్కన పెట్టడట . అందుకే ఉపాసనతో పెళ్లి అనగానే ముందుగా ఉపాసనకు సురేఖ “మా వాడిని హెల్దీ గా మార్చమని.. డైట్ కంటిన్యూ చేయమని చెప్పాలి ..మా వాడి హెల్త్ ని కంట్రోల్ లోకి తీసుకురావాలి.. వాడు నీ మాటే వింటాడు ” అంటూ కండిషన్ పెట్టిందట . ఉపాసన సైతం సరదాగా ఆ కండిషన్ ని యాక్సెప్ట్ చేసిందట . అంతేకాదు ఉపాసన అత్తగారికి ఇచ్చిన మాటను తూచా తప్పకుండా పాటించింది. అనుకున్నట్టుగానే రామ్ చరణ్ టోటల్ గ్రిప్ లోకి తీసుకొని ఫుడ్ విషయంలో కంట్రోల్లో పెట్టేసింది . ఇప్పటికీ షూటింగ్స్ కి బయటకు వెళ్లిన సరే రామ్ చరణ్ కు ఇంటి నుండి క్యారియర్ వెళ్లాల్సిందే ..సపరేట్ డైట్ ఫాలో అవ్వాల్సిందే..!!